health

రాబోయేకాలంలో మ‌న శ‌రీరంలో కనుమరుగయ్యే 10 శరీర అవయవాలు.!!

అసలు ఈ అవయవాల కనుమరుగేంటి..?ఇలా జరిగితే మనిషి ఉంటాడా అనుకోకండి.,కానీ ఇది నిజం.! పూర్వం పాములకు కాళ్ళుండేవట.! వాటిని ఉప‌యోగించ‌డం మానేశాక‌..అవి క్ర‌మంగా అంత‌రించిపోయాయ‌ట‌.!! అలాగే మాన‌వుల‌లో క్ర‌మంగా అంత‌రించిపోవ‌డానికి రెడీగా ఉన్న అవ‌యవాలేంటో ఓ సారి చూద్దాం.!!

పదమూడవ ప్రక్కటెముక::  మానవుని కపాల నిర్మాణం చింపాంజీలను,గొరిల్లాలను పోలి ఉండి ,పన్నెండు పక్కటెముకలను కలిగి ఉంటుంది ,కానీ పెద్దవారిలో 8 % మందికి 13 వ ప్రక్కటెముక ఉండడం విశేషం..కాల‌క్ర‌మేణా ఇది మాన‌వ శ‌రీరం నుండి తొల‌గిపోనుంది.!!

 

కంటి మూడ‌వ పొర:: సాధారణంగా పక్షులలో ,క్షీరదాల్లో కంటికి ఒక రక్షణ పొర వుండి కంటిలో దుమ్మును చేరనీయవు ,అలాగే మానవులకు ఒక సన్నని మలచబడిన ఒక పొర కంటిలోపలి భాగంలో ఎర్రగాఉంటుంది ,అది కూడా తర్వాతితరంలో ఉండదట.!

కాలివ్రేళ్ళు:: మన పూర్వీకుల అడుగుల మధ్యభాగం ఆధారంగా , బొటన వేలు బాలన్స్ చేస్తూ నడిచేవారని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు,కానీ ఇటీవల వచ్చిన నివేదిక ఆధారంగా శరీర బరువంతా కాలి మధ్యకు కేంద్రీకరించబడి పాదమధ్యభాగం సహాయంతో నడవగల్గుతుంది కనుక కాలివేళ్ళు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.!

చెవిఫై పాయింట్ : మన చెవి పైభాగంలో సన్నని ఒక వంకు ఉంటుంది దాని వల్ల దూరశబ్దాలు చెవికి బాగా వినిపిస్తాయి,కానీ నేడు ఇవి లుప్తమవుతున్నాయి.!

అపెండిక్స్:
మన బాడీలో అధిక సెల్యులోస్ జీర్ణం చేసేది అపెండిక్స్ ,ఇది పెద్దప్రేగులోని కండరాల దగ్గరుండే ఒక అధిక అవయవం ,ఇది కూడా కాలక్రమేణా ఉండదట. ఇప్ప‌టికే చాలా మందిలో దీనిని తొల‌గిస్తుంటారు.!

జ్ఞానదంతాలు: ప్రజల్లో 5 % మందికి జ్ఞానదంతాలుంటాయి ,క్రమేణా ఇవి మాయమౌతున్నాయి.!

మెడ ప్రక్కటెముక:: ఇవి కొంత మందిలో అరుదుగా కన్పిస్తాయి,సాధారణంగా ఇవి సరీసృపాలలో ఉంటాయి కానీ మనుషులలో ఏదోఒక వైపు ఉంటాయి ,కాలగమనంలో ఇవి కన్పించవు.

అరచేతి కండరం:
కండరాలలో ఒక ముఖ్య కండరమైన అరచేతి కండరం మణికట్టు వరకు ఉంటుంది ప్రాచీన కాలంలో దీనిని పర్వతారోహణకు ఉపయోగించేవారు,ప్రస్తుతం ఇది ప్ర‌పంచ జ‌నాభాలో కేవలం 11 % మందికి మాత్ర‌మే ఉండటం గమనార్హం.

కండరాలపైనుండే రోమాలు :
ఇవి సహజంగా జంతువులకు వేడి,చలి నుండి కాపాడుతాయి,అటువంటి రోమాలు మనిషినుండి కనుమరుగయ్యాయి .

గాలితో నిండిన ఎముక రంధ్రాలు (parasanal synases )::
ఈ కుహరాలు శ్లేష్మంపై వుండి తలకు ఉపశమనాన్ని ఇస్తాయి ,కానీ కాలాంతరంలో ఇవి కనుమరుగవుతున్నాయి.

Comments

comments