news

ఇంకో స్టార్ నటుణ్ని కోల్పోయిన టాలీవుడ్ …టాలీవుడ్ లో తీవ్రవిషాదం…..

టాలీవుడ్‌ సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు వినోద్‌ మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఈయన అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు.

ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్, మిర్చి తదితర సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు వినోద్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 300కు పైగా సినిమాల్లో నటించిన ఆయన తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిరపరిచితుడైన వినోద్ పలు సీరియళ్లలోనూ నటించారు. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్‌గా నటించి పేరు తెచ్చుకున్న ఆయన మృతి విషయం తెలిసి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వినోద్‌ 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు.

తెలుగు సినిమాల్లో చంటి, నల్లత్రాచు, లారీ డ్రైవర్, ఇంద్ర, నరసింహనాయుడు, భైరవద్వీపం వంటి సినిమాల్లో తన నటన ద్వారా పేరు తెచ్చుకున్నారు. వినోద్‌కు భార్య వీనావతి, పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. 

ఆయన మృతిపట్ల  సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలిపింది.

Comments

comments