news politics

కేంద్ర బడ్జెట్-2018-19 ముఖ్యాంశాలు ….

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2018-19ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు.. పార్లమెంట్‌లో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా బడ్జెట్ – 2018-19కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్డీయే సర్కారు ప్రతిపాదించనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత జైట్లీ ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రజలకు, రైతులకు అర్థమయ్యేందుకు ఈసారి జైట్లీ హిందీలో ప్రసంగిస్తున్నారు. హిందీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రిగా జైట్లీ చరిత్రకెక్కారు. ప్రస్తుత ప్రభుత్వం కింద జైట్లీ సమర్పిస్తున్న ఐదో బడ్జెట్ ఇది.


-2018-19 బడ్జెట్ రూ. 24 లక్షల 42 వేల 213 కోట్లు
-వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
-2018-19లో ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉంటుందని అంచనా

-ప్రయాణ, వైద్య ఖర్చులకు రూ. 40 వేల వరకు పన్ను రాయితీ
-రూ. 40 వేల వరకు ప్రయాణ, వైద్య ఖర్చులకు స్టాండర్డ్ డిడక్షన్ గా వర్తింపు
-స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా ప్రభుత్వ ఆదాయంలో రూ. 8 వేల కోట్లు లోటు
-సీనియర్ సిటిజన్లకు వైద్య ఖర్చులకు మరింత అదనపు రాయితీ
-సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు అదనపు రాయితీ రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకు పెంపు
-మొబైల్ ఫోన్లు, టీవీల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 20 శాతానికి పెంపు
-దిగుమతి చేసుకునే వస్తువులపై సామాజిక అభివద్ధి సెస్ 10 శాతానికి పెంపు
-జీడిపప్పుపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతం నుంచి 2.50 శాతానికి తగ్గింపు

-ప్రత్యక్ష పన్నుల్లో 12.6 శాతం వృద్ధి
-గత రెండేళ్లుగా ఆదాయపన్ను వసూళ్లలో భారీ పెరుగుదల
-85.51 లక్షలకు చేరుకున్న పన్ను చెల్లింపుదారులు
-40 శాతానికి పెరిగిన పన్ను రిటర్నులు ధాఖలు చేసిన వారి సంఖ్య
-సహకార సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పాదక సంస్థలకు నూరు శాతం పన్ను రాయితీ
-చిన్నతరహా పాదరక్షలు, తోలు ఉత్పత్తుల తయారీ సంస్థల లాభాలపై ఆదాయ పన్ను రాయితీ

-రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, గవర్నర్లకు జీతాలు పెంపు
-రాష్ర్టపతి వేతనం రూ. 5 లక్షలు, ఉపరాష్ర్టపతి వేతనం రూ. 4 లక్షలు, గవర్నర్ వేతనం రూ. 3.5 లక్షలు
-ఎంపీల వేతనాలు ఐదేళ్లకోసారి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరణ

2018-19లో వ్యవసాయ రుణాలకు రూ. 11 లక్షల కోట్లు
-రైల్వేలకు రూ. 1.48 లక్షల కోట్లు
-ఎస్సీల సంక్షేమం కోసం రూ. 56 వేల కోట్లు
-చిన్న, సూక్ష్మ తరహా పరివ్రమల కోసం రూ. 3,790 కోట్లు
-టీబీ రోగుల సంక్షేమం కోసం రూ. 600 కోట్లు
-గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ. 16,713 కోట్లు
-విద్య, ఆరోగ్య, సంక్షేమానికి రూ. 1.38 లక్షల కోట్లు
-రోడ్లు, మౌలిక వసతులకు రూ. 9.64 లక్షల కోట్లు
-ఇంటింటికీ తాగునీటి పథకానికి రూ. 77,500 కోట్లు
-ఆకర్షణీయ నగరాల కింద రూ. 2.04 లక్షల కోట్లతో 99 నగరాల ఆధునీకరణ
-చేనేత, జౌళి రంగానికి రూ. 7,500 కోట్లు
-టెక్స్ట్ టైల్ రంగానికి రూ. 7,140 కోట్లు
-2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్ల మేర ముద్రా రుణాలు
-ప్రతి పౌరునికి సమీపంలో వెల్ నెస్ సెంటర్
-వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 1200 కోట్లు

-లక్ష గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు పూర్తి
-ఈ ఏడాది 5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు, 5 కోట్ల మంది వైఫై సౌకర్యం

-ప్రతి వ్యాపార సంస్థకు ఒక యూనిక్ ఐడీ
-సులభతర వాణిజ్యంలో పారదర్శకత కోసం ప్రతి వ్యాపార సంస్థకు ప్రత్యేక గుర్తింపు
-సైనిక సంపత్తి, ఆయుధాల తయారీలో స్వావలంబనకు ప్రయత్నం
-ఆయుధాల తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం
-దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 50 లక్షల కోట్లు కావాలి
-స్టాంప్ డ్యూటీల విధానం నుంచి బయటపడేందుకు రాష్ర్టాలతో సంప్రదింపులు
-స్టాంప్ డ్యూటీల విషయంలో కొత్త విధానం
-క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం అంగీకరించదు

-కొత్త ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్ 8.33 శాతం నుంచి 12 శాతానికి పెంపు
-పెంచిన ఈపీఎఫ్ మూడేళ్ల పాటు అమలు, అన్ని రంగాలకు వర్తింపు
-జీవన ప్రమాణాల మెరుగుదలకు పైలట్ ప్రాజెక్టు కింద 115 జిల్లాలు ఎంపిక
-306 కౌశల్ యోజన కేంద్రాలు ఏర్పాటు
-పది పర్యావరణ కేంద్రాల అభివృద్ధి, పర్యాటక రంగంలో ప్రయివేటు పెట్టుబడులు ఆకర్షణ
-పురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధికి కృషి
-గంగా పరీవాహక ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా చేయాలన్నది లక్ష్యం

-గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 14.34 లక్షల కోట్లు
-జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ. 5,750 కోట్లు
-వెదురు పరిశ్రమ ప్రోత్సాహం కోసం రూ. 1290 కోట్లు
-నీటి వసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు

-నాణ్యమైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందించే అవకాశం
-అందుకోసమే ఇంటిగ్రేటెడ్ బీఈడీని తీసుకువస్తున్నాం
-బ్లాక్ బోర్డు నుంచి డిజిటల్ బోర్డు నినాదంతో ఉపాధ్యాయ శిక్షణలో ఆధునిక సాంకేతికత
-విద్యాభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమం
-గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ పాఠశాలల ఏర్పాటు
-వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు
-మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఓ మెడికల్ కాలేజీ

-మహిళల హుందాతనాన్ని కాపాడటంలో శౌచలయాల నిర్మాణం తోడ్పడుతోంది
-దేశంలో పేదలకు స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది
-నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీం కింద 10 కోట్ల కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు, ఆరోగ్య బీమా
-రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం
-పేదలందరికీ ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తాం
-2019 నాటికి మహిళా సంఘాలకు రూ. 75 వేల కోట్ల రుణాలు

-ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనతో గ్రామీణ రోడ్లను అనుసంధానం చేస్తాం
-2022 నాటికి అన్ని గ్రామాలకు పక్కా రహదారుల నిర్మాణం
-వ్యవసాయ, అనుబంధ రంగాల్లో క్లస్టర్ ఆధారిత విధానాలతో మరింతగా ప్రయోజనాలు
-2017-18లో ఎగుమతులు 17 శాతంగా ఉన్నాయి
-75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని ప్రధాని పిలుపు
-వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సరళీకరణ
-సేంద్రియ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం
-దేశవ్యాప్తంగా ఆహారశుద్ధి, వాణిజ్యశాఖలతో కలిసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్ల ఏర్పాటు
-ఆహార శుద్ధి రంగానికి రూ. 1400 కోట్లు కేటాయించాం
-రైతులందరికి కిసాన్ క్రెడిట్ కార్డులు
-పాడి రైతులు, ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు
-పశుసంవర్ధక, ఆక్వా పరిశ్రమల అభివృద్ధికి రూ. పది వేల కోట్లు
-దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం

-రూ. 2 వేల కోట్ల కార్పస్ ఫండ్ తో వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి చర్యలు
-మార్కెట్ ధర తక్కువగా ఉన్నా రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం
-మార్చి నాటికి 585 మార్కెట్లు ఈనామ్ కు అనుసంధానం చేస్తాం
-మరో 3 కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం
-ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు వెనుకబడిన కులాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం
-సోలార్ పవర్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం
-సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సులువుగా అనుమతులు ఇస్తున్నాం
-విద్యాప్రమాణాల వృద్ధికి రాష్ర్టాలతో కలిపి మరిన్ని కార్యక్రమాలు చేపడుతాం
-ధాన్యం, పప్పు దినుసుల మద్దతు ధర ఒకటిన్నర రెట్లు పెంచాం
-నగదు బదిలీతో మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడంతో అవినీతి తగ్గిపోయింది

-ఆపరేషన్ గ్రీన్ కోసం రూ. 5౦౦ కోట్లు
-అగ్రిమార్కెట్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం
-కనీస మద్దతు ధర రైతులకు అందిస్తున్నాం
-అగ్రికల్చర్, రూరల్ మార్కెట్లను కలిపేలా చర్యలు
-ప్రత్యక్ష పన్నుల రాబడి ప్రయోజనం పేదలకు దక్కుతుంది
-నగదు బదిలీ పథకంతో ప్రపంచానికి భారత్ కొత్త విజయ పాఠం నేర్పుతోంది
-రెండు రోజుల్లో పాస్ పోర్టు మంజూరు, ఒక్కరోజులోనే కంపెనీ రిజిస్ర్టేషన్ మన విజయాలు
-ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నాం

-అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం
-వచ్చే ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా
-వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రధానంగా దృష్టి
-2020 నాటికి రైతులను ధనికులుగా చేస్తాం

-జన ఔషధి కేంద్రాల ఏర్పాటుతో తక్కువ ధరకే ఔషధాలు విక్రయిస్తున్నాం
-మ్యానుఫాక్చర్ సెక్టార్ లో 8 కంటే ఎక్కువ వృద్ధి నమోదైంది
-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మంచి ఫలితాలు సాధించాం
-ఈ బడ్జెట్ తో వ్యవసాయం, గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది

-ఉజ్వల యోజన ద్వారా పేదలకు గ్యాస్ కనెక్షన్లు
-పేదలందరికీ ఇండ్లు నిర్మించే కార్యక్రమం నడుస్తోంది
-గత కొన్నేళ్లుగా తెస్తున్న సంస్కరణలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి
-బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణతో కొత్త సంస్కరణలకు నాంది పలికింది

-ప్రపంచంలో భారత్ మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ
-జీఎస్టీతో పన్నుల విధానం సులభమైంది
-మొదటి మూడేళ్లలో 7.5 శాతం వృద్ధి రేటు నమోదు
-ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా నడుస్తున్నాయి
-పథకాల్లో అవినీతి లేకుండా చేశాం

Comments

comments