movies

బండ్ల గణేష్ పై కేసు నమోదు…

స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఒకే సారి రెండు భారీ చిత్రాలు నిర్మించి పలు ఐటీ దాడులు కూడా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చెక్కు బౌన్స్ కేసు పై కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా కోర్టుకు శుక్రవారం సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గణేష్‌ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు .ఆయన ఉదయం ప్రొద్దుటూరుకు వచ్చి తన కారును జార్జిక్లబ్‌లో ఉంచి అక్కడినుంచి కోర్టులోకి వెళ్లారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే బండ్ల గణేష్‌ను జడ్జి విచారించారు.

బాకీలు తీర్చడానికి సమయం కావాలని జడ్జిని గణేష్‌ రిక్వెస్ట్ చేసినట్టు కోర్టు వర్గాలు తెలిపాయి. బండ్ల గణేష్‌ పై ఇప్పటికే 68 చెక్‌బౌన్సు కేసులు ఉన్నాయి. ఇందులో శుక్రవారం 21 కేసుల విచారణకు ఆయన హాజరయ్యారు. మూడుకేసులు లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కారమయ్యాయి. మిగిలిన కేసులపై మొదటి ఏడీఎం ప్రదీప్‌కుమార్‌ విచారించారు. విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.

Comments

comments