Sports

యువరాజ్ సింగ్ పై గృహ హింస కేసు.

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ గృహ హింస వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసులో యువరాజ్ సింగ్ పాత్ర నేరుగా లేకపోయినా అతడి కుటుంభ సభ్యులతో పాటు కలిపి యువరాజ్ సింగ్ పైన మరదలు ఆకాంక్ష కేసు పెట్టింది.
నటి, మోడల్ అయిన ఆకాంక్ష.. తన భర్త యువరాజ్ సింగ్ తమ్ముడు జొరవర్ సింగ్ తో పాటు అత్త షబ్నమ్ సింగ్ తనను మానసికంగా మరియు ఆర్థికంగా కూడా తీవ్రంగా వేధిస్తున్నారని ఆకాంక్ష పోలీసులకి ఫిర్యాదు చేసింది. పిల్లల్ని కనమంటూ వారు తనపై బాగా ఒత్తిడి తెస్తున్నారని ఆమె తన పిటిషన్లో పేర్కొనింది. తల్లి, తమ్ముడు తనపై వేధింపులు జరుగుతున్న సమయంలో యువరాజ్ సింగ్ ప్రేక్షక పాత్ర పోషించడాని కనీసం ఆపే ప్రయత్నం చెయ్యకుండా తన తల్లి షబ్నమ్ పక్షాన చేరి యువి కూడా తనపై ఒత్తిడి తెచ్చాడు అని ఆకాంక్ష వెల్లడించింది. తన తల్లి చెప్పినట్టు పిల్లల్ని కనకుంటే వాళ్ళ ఇంట్లో చోటు ఉండదు అని కూడా యువి హెచ్చరించాడు అని ఆకాంక్ష పేర్కొంది.
2014లో జొరవర్ కు ఆకాంక్షతో వివాహం జరిగింది. వీళ్ల వివాహం అయిన తరువాత కొంత కాలానికి అత్త షబ్నమ్ కోడలు ఆకాంక్ష కోర్ట్ మెట్లు ఎక్కటం కూడా జరిగింది. అది జరిగిన తరువాత కూడా ఇలా జరగటంతో వాళ్ళ కుటుంబంలో చాలా మనస్పర్థలు ఉన్నట్టు అర్థం అవుతుంది. కాగా ఈ నెల 21 శనివారం యువరాజ్ సింగ్ కుటుంబ సభ్యులందరూ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

Comments

comments