news

ఆడవాళ్ల కలలకు, మగవాళ్ల కలలకు ఇంత వేరియేషన్ ఉందా..!

పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువగా కలలు వస్తాయట. అవి కూడా వారిని మానసికంగా ఇబ్బంది పెట్టే చెడు కలలై ఉంటాయట. ఆడవాళ్లకు వచ్చే కలలపై అమెరికాకు చెందిన అమెరిస్లీప్ అనే సంస్థ 2000 మందిపై ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

  • అమ్మాయిలకైతే ప్రిపేర్ కాకుండానే పరీక్షలు రాస్తున్నట్లు కలలు వస్తాయి.
  • మహిళలకు ఎక్కువగా భర్త తమను మోసం చేశాడని కలలు వస్తాయట.
  • ఎవరో తమను వెంటాడుతున్నట్లు, నోట్లోని దంతాలు ఊడిపోయినట్లు, సాలె పురుగులను చూస్తున్నట్లు కూడా కలగంటారట.
  • అధ్యయనంలో పాల్గొన్న సగం మందికిపైగా మహిళలు.. ఎవరో తమను తరుముతున్నట్లు ఎక్కువగా కలగన్నట్లు చెప్పారు.
    * మహిళల్లో ఆందోళన ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి కలలు వస్తాయని అమెరిస్లీప్ పరిశోధకులు అంటున్నారు.

మగాళ్ల విషయానికి వస్తే.. వారికి ఇలాంటి భయంగొల్పే కలలేం రావండి. ఏంచక్కా గాల్లో ఎగురుతున్నట్లు, అందమైన అపరిచిత వ్యక్తిని (అమ్మాయే అని చెప్పనక్కర్లేదు) కలిసినట్టు.. లేదంటే డబ్బు దొరికినట్టు కలలు వస్తాయట. మరి మాకు అలాంటివేమీ గుర్తుకు లేవే అని మగాళ్లు అనుకుంటున్నారా? అది మీ తప్పు కాదు.. మగాళ్లలో 14 శాతం మందికే కలలు గుర్తుంటుండగా, ఆడవాళ్లలో 24 శాతం మంది తమకు వచ్చిన కలను గుర్తుంచుకుంటారట.

Comments

comments