news

యాంక‌ర్ ప్ర‌దీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో లో దొరికినప్పుడు, కారు లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలుసా ….!

న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి కారు నడిపి అడ్డంగా బుక్కయిన యాంకర్ ప్రదీప్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు మరో కేసు పెట్టనున్నారు. ప్రదీప్ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దానిపై మరో కేసు పెట్టనున్నారు. అటు రేపు కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని ఆదేశించారు.ప్రదీప్‌కు నిపుణులు మూడు గంటల పాటు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ తర్వాత ప్రదీప్‌ను కోర్టులో ప్రవేశపెడతారు.న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అతను మోతాదుకు మించి మద్యం సేవించి కారు నడుపుతుండటంతో ప్రదీప్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

అయితే ఆ సమయంలో ప్రదీప్ పక్కన కూర్చున్నది ఒక లేడీ.. ఆమె ఒక ప్రముఖ యాంకర్ అని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఆమె గతంలో ప్రదీప్ తోపాటు యాంకర్ గా పని చేసిన అప్ కమింగ్ హీరోయిన్ అనే వార్త వైరల్ అవుతుంది. కాగా అతని పక్కన ఉన్న లేడీ ఎవరని ఆరా తీయగా ఆమె ప్రదీప్ స్నేహితురాలు అని తెలిసింది.డిసెంబర్ 31 న వారు న్యూ ఇయర్ పార్టీలో ప్రదీప్ తోపాటు తన స్నేహితులు, స్నేహితురాళ్ళు పాల్గొన్నారు. పార్టీ అయిపోయాక ఇంటికి చేరదామనే సమయంలో పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో అడ్డంగా బుక్కయ్యారు. దీంతో మద్యం సేవించి దొరికిపోయిన ప్రదీప్ కు కౌన్సలింగ్ ఇవ్వడానికి పోలీసులు అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు.

ఆసమయంలో మిగతా వారిని వెళ్లిపోవాలని కోరారు. దీంతో ప్రదీప్ స్నేహితుడు ఆమెను ఒక ప్రైవేట్ కారులో తన ఇంటికి చేర్చారు. అయితే రెండు రోజులుగా ప్రదీప్ పక్కన ఉన్న ఆమె గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండటం, ఆమె ప్రదీప్ స్నేహితురాలు అవ్వడం చేత ఈ వార్తలకు పులుస్టాప్ పడినట్లయిందంటున్నారు.మొత్తానికి న్యూ ఇయర్ పార్టీ సెలబ్రిటీ అందరికి ఎలా ఉన్నా సరే యాంకర్ ప్రదీప్ కు మాత్రం చుక్కలు చూపిస్తుంది. న్యూ ఇయర్ పార్టీలో ఫుల్ గా మందు కొట్టి డ్రంక్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోవడంపై యావత్ తెలుగు మీడియాలో సంచలనంగా మారింది.

4 టీవీ ఛానళ్లలో 40కిపైగా షోలు చేసే ప్రదీప్ మాచిరాజు రూ.2కోట్ల రూపాయల కారు సైతం సీజ్ అయింది. ఆర్థికంగా భారీగానే సంపాదించుకునే ప్రదీప్ ఓ డ్రైవర్ ను పెట్టుకోవచ్చు కదా అని అంతా అంటున్నారు. కనీసం ఆ ఒక్కరోజు కు అయినా వేరొకరిని డ్రైవింగ్ కి తీసుకెళ్లొచ్చు కదా అని చెబుతున్నారు.ప్రస్తుతం ప్రదీప్ కారు పోలీసులు అదుపులో ఉండగా నాంపల్లిలో ప్రదీప్ కు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చేందుకు సన్నాహాలు చేశారు. 178 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వారం రోజులు కస్టడీలో ఉంచుతారని అంటున్నారు.

Comments

comments