Business

ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది !!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి మరో బ్రాండ్‌ రాబోతోంది. ఇప్పటిదాకా ఈ-రిటేల్‌తో వినియోగదారులకు ఎంతగానో చేరువైన ప్రముఖ ఈ-కామర్స్‌ పోర్టల్‌ ‘ఫ్లిప్‌కార్ట్‌’ త్వరలో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో రానుంది. ‘బిలియన్‌’ బ్రాండ్‌తో ఫోన్‌ను విడుదల చేయనుంది.

ఆన్‌లైన్‌ వేదికగా నిత్యం లక్షల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను విక్రయించే ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా మొబైల్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ‘బిలియన్‌’ బ్రాండ్‌ కింద స్మార్ట్‌ఫోన్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఈ ఏడాది జులైలో ప్రకటించింది.

ఇందులో భాగంగా నవంబర్‌ 15న తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ‘బిలియన్‌ క్యాప్చర్‌ ప్లస్‌’ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. నవంబర్‌ 15 నుంచే ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఫోన్‌ ధర రూ. 10,999 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 32జీబీ మోడల్‌ ధర రూ.10,999, 64జీబీ మోడల్‌ ధర రూ.12,999గా ఉండనుంది.

అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించలేదు. డ్యుయల్‌ కెమెరాతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

 

Comments

comments