health

గ్యాస్ ట్రబుల్ ఒక పెద్ద సమస్య గా వుందా ??

గ్యాస్ ట్రబుల్..ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది. ఇది మనిషిని చాలా ఇబ్బంది కలుగ చేస్తుంది. మనలను వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్‌ ట్రబుల్‌ ప్రధానమైనది. గ్యాస్‌ ట్రబుల్‌ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. అనేక ఇబ్బందులకు గురిచేసే ఈ సమస్య గురించిన సరైన అవగాహన ఉంటే దీనిని ఎదుర్కొనడం కష్టమేమీ కాదు.

కారణాలు:
 • కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం.
 • అధిక టీ/కాఫీ సేవనం
 • సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం
 • ఒత్తిడి, అలసట
 • మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం
 • మానసిక ఆందోళన, దిగులు, కుంగుబాటుకు లోనుకావడం వంటి మానసిక కారణాలు
 • ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం
 • జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి గ్యాస్‌ట్రబుల్‌ సోకడానికి కారణాలు.

లక్షణాలు:
 • కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
 • ఆకలి లేకపోవడం
 • పెద్ద శబ్దంతో తేంపులు రావడం
నివారించాలంటే….

 • సరైన వేళకు ఆహారం తీసుకోవడం.
 • నీరు ఎక్కువగా త్రాగండి.
 • వ్యాయామం చెయ్యడం
 • వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడాలి.
 • మసాలాలు, వేపుళ్ళు, ఆయిల్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌, ఆల్కహాల్‌, స్మోకింగ్‌, టీ, కాఫీలు మానివేయాలి. నిల్వ ఉంచిన పచ్చళ్ళు తినడం మానేయాలి. కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే ఆహారపదార్థాలు తింటే కూడా కడుపులో గ్యాస్‌ పెరుగుతుంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలి.
 • పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి.
 • వాకింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ లాంటి ఆటలు, క్రీడలలాంటి శారీరకశ్రమతో కూడిన వ్యాయామాలు, కడుపు నిండుగా ఒకేసారి ఆహారం తీసుకోకుండా ఉండటం చేయాలి.
ఇంట్లోనే చేసుకునే ఔషదాలు…
 1. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, శొంటి ఈ మూడిరటిని సమపాళ్ళలో తీసుకొని విడివిడిగా గ్రైండ్‌ చేసి అన్నింటిని కలిపి తగినంత ఉప్పువేసి ఒక సీసాలో వేసుకొని భోజనం తర్వాత గ్లాస్‌ మజ్జిగలో ఒక చెంచా పొడి వేసుకొని రోజు తాగండి. భోజనం తర్వాత అలసట, అజీర్తి, గ్యాస్‌ వుండవు.
 2. గ్లాసెడు నీళ్ళలో చిటికెడు చొప్పున సోంపు, జీలకర్ర, రాతి ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీళ్ళు తాగినా ఉపశమనం లభిస్తుంది.
  రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను పరగడుపును మింగేసి మంచినీళ్ళు తాగితే క్రమంగా బాధ తగ్గుతుంది.
  కాసిన్ని మెంతిగింజలు నీళ్ళలో నానబెట్టి పొద్దున లేవగానే ఆ నీళ్ళను తాగినా జీర్ణశక్తి మెరుగై గ్యాస్‌ ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.
 3. వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.
  నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతినిత్యం భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి.
 4. పుదీనా ఉబ్బరం మరియు కడుపు నొప్పి తగ్గించడములో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నపుడు పుదీనా టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అల్లం, నల్ల ఉప్పు మరియు నిమ్మకాయ రసం తీసుకోవడం ఉబ్బరం తగ్గి పొట్ట తేలికగా అవుతుంది.

Comments

comments