news

యావరేజ్ అబ్బాయిలకే అమ్మాయిల చూపు !!

అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారని చాలా మంది భావిస్తుంటారు. కానీ తమకు కాబోయే పార్టనర్ మిస్టర్ పర్ఫెక్ట్ కానక్కర్లేదని, చూసేందుకు యావరేజ్‌గా ఉన్నా చాలని అమ్మాయిలు భావిస్తారట. హ్యాండ్సమ్‌గా ఉన్న అబ్బాయి వేరే అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తాడని భావించడమే ఇందుకు కారణమట. ఇటీవల ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేవలం ఏడు శాతం మంది అమ్మాయిలు మాత్రమే పర్ఫెక్ట్ పార్టనర్‌ను కోరుకుంటున్నారట. మెజార్టీ అమ్మాయిలు మాత్రం.. ఫర్వాలేదు అనేలా ఉండే  అబ్బాయిలకే ఓటేస్తున్నారట. ఆకర్షించే విషయంలో సగటు వ్యక్తులవైపే అమ్మాయిలు మొగ్గు చూపుతున్నారు.

సగటుగా ఉండే అబ్బాయిలకు 40 శాతం మంది సరేనంటే.. పది పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు ఇచ్చేలా ఉన్నఅబ్బాయిలకు 22 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. 15 శాతం మంది మాత్రమే మిస్టర్ పర్‌ఫెక్ట్‌లను తమ పార్టనర్‌గా ఎంచుకుంటున్నారు. ఆకర్షణ విషయంలో పార్టనర్ తమను డామినేట్ చేయొద్దని సగం మంది అమ్మాయిలు భావిస్తారట. అత్యంత ఆకర్షణీయంగా ఉండే పార్టనర్ వల్ల అమ్మాయిలు కొంచెం అభద్రతా భావానికి లోనవుతారట. కాబట్టి మరీ అంత అట్రాక్టివ్‌గా లేకపోవడమే పెద్ద ప్లస్ అన్నమాట. ఇక..

 

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని పనంటూ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే రై.. రై.. మంటూ బైక్‌ను అటు ఇటు ఇష్టమొచ్చినట్లు డ్రైవ్ చేస్తుంటారు. అబ్బాయి అమ్మాయి వెంట పడుతూ ఎన్నెన్నో అవమానాలు భరిస్తుంటారు. అమ్మాయితో పరిచయం పెంచుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు, కానీ అమ్మాయి నుండి రెస్పాన్స్ ఉండదు. అసలు అమ్మాయిని ఆకర్షించడం ఎలా? ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. ఇదిమీలోని అత్మవిశ్వాసాన్ని చూపుతుంది. అదే చిరునవ్వు ఇతరులను రిలాక్స్ అవ్వడానికి కారణమౌతుంది. అలాగే మీ నవ్వుకు కాస్త సరదా మాటలను కలపండి. తను మీతో చనువును పెరిగే దాకా అలాగే కొనసాగించాలి.

మీరు ధరించే దుస్తులుపై అమ్మాయిలు ఖచ్చితమైన అంచనాలు వేస్తారు. కనుక జాగ్రత్తగా దుస్తులను ఎంచుకోవాలి. క్రొత్త మోడళ్లను ట్రై చేస్తుండాలి. ఫిట్, హెల్తీగా ఉంటే సులభంగా అమ్మాయిల దృష్టిని ఆకర్షించవచ్చు. మీరు అథ్లెట్ కాకపోయిన మీకు వర్కవుట్ చేయడం ఇష్టం లేకున్నా, మీ నడిచే స్టయిల్, నిలబడే తీరు, ఇంకా మీ భుజాలు అవి ముందుకు వాలిపోయివుంటే వెనుకకు సరిచేసుకోండి. అలాగనీ మీ బుజాలను బిగుసుకున్నట్టు ఉంచుకోకూడదు. మీరు రిలాక్స్‌గా ఉన్నట్లు అమ్మాయు దృష్టిలో అనుకునే విధంగా నడుచుకోవాలి.

Comments

comments