Business

గూగుల్ కి మొట్టికాయలేసిన యూరోపియన్ యూనియన్ | Google fined by EU

google-fined-by-eu

.
google fined by eu: గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్ అని మనకి తెల్సిందే ఐతే మనం గూగుల్ లో ఏదేనా సెర్చ్ చేస్తే దానికి సంభందిత ఫలితాలు కుడా చూపిస్తుంది గూగుల్. కానీ గూగుల్ తన యొక్క పరపతిని వాడుకొని సంభందిత ఫలితాల్లో తనకి లాభం చేకూర్చే విధంగా ఫలితాల్ని తారు మారు చేస్తుంది.  ఎలా అంటే మీరు గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మీకు రిజల్ట్స్ లో ముందుగా కనిపించేవి  ప్రకటనలే. ఆ ప్రకటనలు కూడా మనం సెర్చ్ చేసిన దానికి సంబంధించినదే అయ్యి ఉంటుంది.

google fined by eu
google fined by eu

ఆ ప్రకటనల పేరు చెప్పి గూగుల్ తన సొంత షాపింగ్ ని అన్నిటికన్నా పైన చూపిస్తుంది. దాని వల్ల గూగుల్ కి ఆదాయం వస్తుంది. ఆలా చేయడం ద్వారా మిగతా సంస్థల జాబితా కింద వరసలో చూపిస్తుంది. సెర్చ్ రిజల్ట్స్ లో గూగుల్ షాపింగ్ యాడ్స్ చూపించాల్సిన అవసరం లేదు అని ఐరోపా యూనియన్ కమిషనర్ Margrethe Vestager  వ్యాఖ్యానించారు

ఐరోపా యూనియన్ 27-6-2017 న గూగుల్ కు భారీ జరిమానా విధించింది  అది అక్షరాలా 2.7 బిలియన్ $ మన కరెన్సీ లో 17 వేల,727 కోట్ల 42 లక్షల 97 వేల 550/- . ఐరోపా లో ఇదే అతి పెద్ద జరిమానా. ఈ  జరిమానా  90 రోజుల్లో గా కట్టాలని సెర్చ్ రిజల్ట్స్ లో గూగుల్ షాపింగ్ ని తొలిగించాలని లేదంటే మరిన్ని జరిమానాలు తప్పవు అని  ఐరోపా యూనియన్ హెచ్చరించింది.

ఐతే గూగుల్ తన వాదనని బలంగా వినిపించింది. అవి SPONSERED రిజల్ట్స్ వాటి వల్ల వినియోగదారునికి వారికీ కావాల్సింది చూపిస్తుంది అలాగే  సంస్థలకి ఇది ఒక అవకాశం తమ వినియోగదారునికి నేరుగా తమ వస్తువులని చూపిస్తుంది. దాని వాళ్ళ  అమెజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ సంస్థలు బాగా వృద్ధి చెందాయి. కాగా ఈ  జరిమానా ని వ్యతిరేకిస్తూ గూగుల్  కేసు దాఖలు చేసింది.

Comments

comments