Sports

భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ఎంపికైన ఆటగాళ్లు వీళ్ళే.

ఈ నెల 22 నుంచి జరగనున్న న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టులో దినేష్ కార్తీక్ మరియు శార్దూల ఠాకూర్ కి మళ్ళీ చోటు దక్కింది. అలాగే వ్యక్తిగత కారణాల వాళ్ళ ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్ళీ జట్టులో ఎంపిక అయ్యాడు.

శ్రీలంక మరియు ఆస్ట్రేలియా సిరీస్ కి తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్, జడేజాలకు మళ్ళీ సెలెక్టర్లు మొండిచెయ్యి చూపించారు. యువ స్పిన్నర్లు కులదీప్ యాదవ్, యుజ్విందర్ చహాల్ మరియు అక్షర్ పటేల్ నిలకడగా రాణించటమే సీనియర్ స్పిన్నర్లను బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు అనుకోవచ్చు.

టీం ఇండియా జట్టు : విరాట్ కోహ్లీ ( కెప్టెన్ ), రోహిత్ శర్మ ( వైస్ కెప్టెన్ ), శిఖర్ ధావన్, రహానే, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, మహీందర్ సింగ్ ధోని ( వికెట్ కీపర్ ), హర్డిక్ పాండ్య, అక్షర్ పటేల్, కూలదీప్ యాదవ్, చహాల్, జస్ప్రిట్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దూల ఠాకూర్.

మొదటి వన్డే మ్యాచ్ అక్టోబర్ 22న మధ్యాహ్నం 1:30కి ముంబై లో జరగనుంది.
రెండో వన్డే మ్యాచ్ అక్టోబర్ 25న మధ్యాహ్నం 1:30కి పూణే లో జరగనుంది.
మూడో వన్డే మ్యాచ్ అక్టోబర్ 29న మధ్యాహ్నం 1:30కి కాన్పూర్ లో జరగనుంది.

Comments

comments