movies

జై సింహా ప్రీమియర్ షో రివ్యూ

నటీనట వర్గం : బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు
దర్శకత్వం : కె.ఎస్ రవికుమార్. గత ఏడాది సరిగ్గా ఇదే సమయం లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది…మళ్ళీ ఏడాది తిరిగే సరికి మరోసారి సంక్రాంతి కి తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకున్న బాలయ్య కోలివుడ్ సీనియర్ డైరెక్టర్ అయిన కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో జై సింహా అంటూ పవర్ ఫుల్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
   

రెగ్యులర్ షోలకి ఇంకొంచం సమయం ఉన్నా కానీ ఈస్ట్ కంట్రీస్ లో సాయంత్రం 6:30 నుండే పడ్డ ప్రీమియర్ షోల నుండి సినిమా టాక్ ఏంటి అనేది తెలిసేసింది…అక్కడ నుండి వస్తున్న టాక్ ప్రకారం జై సింహా ఎలా ఉంది…అంచనాలను అందుకుందా…. ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం …

కథ గురించి పెద్దగా చెప్పకుండా రెండు షేడ్స్ ఉన్న పాత్రని బాలయ్య చేసినట్లు తెలుస్తుంది…ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో బాలయ్య కి నయనతార జోడి గా నటిస్తుందని…ఇద్దరి మధ్య జరిగే లవ్ ట్రాక్ కొంచం ఎబ్బెట్టుగా ఉందని…ఈ ఏజ్ లో బాలయ్య లవ్ ట్రాక్ పై ఫోకస్ చేయడం అంత ఆకట్టుకోలేదని అంటున్నారు.

అలాగే కొన్ని కామెడీ సీన్స్ కూడా ఫోర్సుడ్ గా పెట్టినట్లు ఉన్నాయని అంటున్నారు….దీంతో పాటు మొదటి అర్ధభాగం సో సో గా అనిపిస్తుందని కొంచం లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుందని అక్కడ చూసిన వాళ్ళు సినిమా గురించి చెబుతున్నారు. ఇవి సినిమాకి మేజర్ గా మైనస్ పాయింట్స్ అని అంటున్నారు…..

ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బాలయ్య పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో రఫ్ఫాడించాడని అంటున్నారు…అలాగే భారీ డైలాగ్స్ తో దుమ్ము లేపాడని….ఇక ఒకటి రెండు సాంగ్స్ లో కుర్ర హీరోల డాన్స్ మూవ్ మెంట్స్ తో దుమ్ము లేపి విజిల్స్ వేసేలా చేశాడని అంటున్నారు.

ఇక మరో ప్లస్ పాయింట్ చిరంతన్ అందించిన సాంగ్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అని అంటున్నారు…సాంగ్స్ చూడటానికి బాగున్నాయని ఫైట్ సీన్స్ హీరో ఎలివేషన్ సీన్స్ లో దుమ్ము లేపే బ్యాగ్రౌండ్ స్కోర్ తో అలరించాడని అంటున్నారు. ఇక డైరెక్షన్ చేసిన కే.ఎస్.రవికుమార్ ప్రెడిక్టబుల్ స్టొరీ నే అయినా ఉన్నంతలో బాగానే తెరకెక్కించాడని అంటున్నారు.

మొదటి అర్ధభాగంతో పోల్చితే సెకెండ్ ఆఫ్ బాగుందని…ట్విస్ట్ లు టర్న్ లతో ఆకట్టుకుందని అంటున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి ని పక్కకు పెడితే లెజెండ్ నుండి ఇప్పటి వరకు బాలయ్య చేసిన సినిమాలలో ది బెస్ట్ మూవీ ఇదే అంటూ ఓవర్సీస్ నుండి చెబుతుండటం విశేషం.

ఓవరాల్ గా ఓవర్సీస్ నుండి సినిమా కి ఎబో యావరేజ్ నుండి హిట్ టాక్ వినిపిస్తుంది…ఇక రెగ్యులర్ షోల కి కూడా ఇదే టాక్ వస్తే బి సి సెంటర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా జై సింహా పండగ సమయం లో పెర్ఫెక్ట్ మూవీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇక్కడ టాక్ ఎలా ఉంటుందో కొన్ని గంటల్లో తెలియనుంది…

Comments

comments