politics

దూకుడు పెంచిన జనసేన !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్   ఒకటి అర తప్పితే మిగతా ఏ సందర్భాల్లోనూ ప్రజలతో మమేకం కాలేదు. ప్రత్యేకంగా రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోలేదు కానీ ఎపుడు దూకుడు పెంచారు ఒక్క సారిగా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ 2019 ఎన్నికల ముందు ఉంటుంది అని అందరూ అనుకున్నారు.

కానీ అనూహ్యంగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో సభ నిర్వహించడం.. అందులో ఎవరూ ఊహించని విధంగా ప్రత్యేక హోదా ఒక్కటే తన అజెండాగా ప్రకటించడం అధికార, ప్రతిపక్ష, విపక్షాలకు కూడా షాకిచ్చింది.

ఏ పార్టీలో ఉన్నా.. ఏ పార్టీ ఇచ్చినా ప్రత్యేక హోదానే తమ పరమావధిగా భావించే వాళ్లు అన్ని పార్టీల్లో.. అన్ని వర్గాల్లో ఉన్నారు. పవన్ కరెక్ట్ గా ఇక్కడే టార్గెట్ గా చేశారు. పార్టీపరంగా కాకుండా జనాల్లో ఉన్న సెంటిమెంట్ ను ఆయన మేల్కొల్పోలే చేసి.. దాని వల్ల లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడు కేవలం ప్రజల అజెండా ప్రత్యేక హోదా అని చెప్పిన పవన్ ముందు ప్రజల్లోకి దూసుకెళ్లడం ద్వారా రాకెట్ స్పీడుతో జనసేనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలుగుతారు.

ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఏ పార్టీని టార్గెట్ గా చెయ్యకుండా కేవలం నాడు కేంద్రం ఏపికి కేటాయిస్తామన్న ప్రత్యేక హోదానే ఆయన అజెండాగా ఎత్తుకోవడంతో రాజకీయ కోణం పూర్తిగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు ఉన్న పవర్ స్టార్ 2014లో జనసేనతో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. జనసేన పేరుతో ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చినా కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చెయ్యడం మినహా ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీకి పవన్ పూనుకోలేదు.

అయితే 2014 నుండి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ పవన్ ఒకటి అర తప్పితే మిగతా ఏ సందర్భాల్లోనూ ప్రజలతో మమేకం కాలేదు. ప్రత్యేకంగా రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోలేదు కానీ ఎపుడు దూకుడు పెంచారు ఒక్క సారిగా.

నాడు తెలంగాణ ఏర్పాటు చేస్తే కేంద్రానికి వ్యతిరేకంగా సీమాంధ్రులు ఏరకంగా అయితే పార్టీలకు అతీతంగా ఉమ్మడి రాష్ట్రం కోసం పోరాడారో ఇప్పుడు అదే స్పూర్తిని ప్రజల్లోకి తెస్తూ తన జనసేనను మెల్లిగా వారికి చేరువ చేయాలన్నదే పవన్ కళ్యాణ్ వేసిన పవర్ మాస్టర్ ఫుల్ స్కెచ్.

పొలిటికల్ గా లేట్ గా స్పందించినా కూడా పవన్ ఎక్కడ కనెక్ట్ అవ్వాలో అక్కడ కరెక్ట్ అయ్యారు. మొత్తంగా పవన్ వేసిన స్కెచ్ మాత్రం రాజకీయ మేధావులకు కూడా చెమటలు పట్టిస్తోంది. మరి సమీప భవిష్యత్తులో కాకున్నా కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం దీని ప్రభావం చాలా గట్టిగా కనిపించే అవకాశాలున్నాయి.

Comments

comments