Business

జియోకాయిన్‌ లో రూపాయి పెడితే ఎన్ని వందలు సంపాదించవచ్చో!!

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ టెలికాం మార్కెట్‌లో ఎలా దూసుకుపోతున్నారో, ఎన్ని సంచలనాలను సృష్టిస్తున్నారో మనందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు మరో సంచలనానికి దారి తీసారు. జియోకాయిన్‌ పేరుతో సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించాలని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ప్లాన్‌ చేస్తోంది. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ కుమారుడి నేతృత్వంలో దేశంలోనే మొదటి సారిగా ఈ ప్రయోగం జరగబోతావుందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బిట్‌కాయిన్ వంటి ఊహాజనితమైన వర్చ్యువల్ కరెన్సీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఈ వ్యాపారంపై కన్నేసింది. బిట్‌కాయిన్‌ వంటి క్రిపోకరెన్సీలకు పోటీగా తన సొంత క్రిప్టోకరెన్సీ-జియోకాయిన్‌ను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే క్రిప్టోకరెన్సీలో పెట్టబుడులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. ఇది చట్టవిరుద్ధమైన కరెన్సీగా ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇందులో పెట్టుబడులు పెట్టరాదని పెట్టుబడిదారులను హెచ్చరించారు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు గ్యారెంటీ ఉండదని తెలిపింది. అంతేకాదు ఎవరయినా ఇన్వెస్ట్ఠ్ చేసినా వారిపై ఆధాయపన్ను శాఖ సీరియస్ గా దృష్టిసారిస్తుందని కూడా హెచ్చరించారు. ఇదిలా ఉండగా రిలయన్స్ సొంతంగా క్రిప్టో కరెన్సీని సృష్టిందన్న వార్త సంచలనంగా మారింది. అంటే ఇక నుంచి బిట్ కాయిన్ సహా వరల్డ్ వైడ్ గా నడుస్తున్న క్రిప్టో కరెన్సీని ఇండియాలో అఫిషియల్ చేస్తారా? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

లాంచింగ్ టైం లోనే జియోకాయిన్‌ లో రూపాయి పెడితే 100 సంపాదించవచ్చునని అప్పుడే మార్కెట్ అనలిస్ట్లు చెబుతున్నారు. 50 మంది యంగ్‌ సభ్యుల టీమ్‌తో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీపై జియో పనిచేస్తుందని లైవ్‌మింట్‌ రిపోర్టు చేసింది. దీనికి అధినేతగా ముఖేష్‌ పెద్ద కొడుకు ఆకాష్‌ అంబానీ సారథ్యం వ్యవహరిస్తున్నారని తెలిసింది. క్రిప్టోకరెన్సీ రూపకల్పన, దాని విక్రయం వంటి అన్ని అంశాలను ఈ టీమ్‌ పరిశీలిస్తుంది.

Comments

comments