news

జియో ” దీవాలి ధన్ ధన ధన్ ” ఆఫర్.

రిలయన్స్ జియో దీపావళి సందర్భంగా కొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ పేరు ” దీవాలి ధన్ ధన ధన్ ” రూ.399/- తో రీఛార్జి చేసుకుంటే జియో వోచెర్ రూపంలో 100 శాతం డబ్బులు వెనక్కి వస్తాయి.

రీఛార్జ్ చేసుకున్న తరువాత రూ.50/- విలువగల 8 జియో వోచెర్స్ లభిస్తాయి. ఈ వోచెర్స్ ని నవంబర్ 15 తరువాత జియో రీఛార్జ్ చేసుకునే సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ పొందాలి అంటే ఈనెల 18 లోపు రూ.399/- తో రీఛార్జ్ చేసుకుంటే ప్రస్తుత పథకం కాలపరిమితి ముగిసిన తరువాత దీన్ని ఆక్టివేట్ చేసుకోవచ్చు.

ఈ అక్టోబర్ 19 నుంచి టారిఫ్ ప్లాన్స్ మారుతాయి కాబట్టి ఈ లోపు రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే ప్రస్తుతం ప్లాన్ మాదిరిగానే ప్రయోజనాలు కొనసాగుతాయి అని రిలయన్స్ జియో సంస్థ తెలిపింది.

Comments

comments