news

జియో సిమ్ లో నెట్ స్లోగా వస్తుందా …!అయితే ఇలా చేయండి

జియో లేదా రిలయన్స్ జియో అనునది రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఒక అనుబంధ పరిశ్రమ. వీరు అతి చౌకగా భారతదేశంలో మొబైల్ మరియు డాటా సేవలను ఆరంభించి ఈ రంగంలో పోటీకి తెరలేపారు. మీరూ, మీ ఫ్రెండ్ ఒకే చోట నిలబడి ఉన్నారనుకుందాం. ఇద్దరూ రిలయన్స్ జియో సిమ్ వాడుతూ స్పీడ్ టెస్ట్ లాంటి యాప్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేస్తే మీరూ, మీ ఫ్రెండ్‌కీ వేర్వేరు స్పీడ్‌లు రావడం గమనించవచ్చు.

ఇలా ఒకే ప్రదేశంలో ఉన్నా తమకు నెట్ స్పీడ్ భిన్నంగా వస్తోందని తరచూ చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు. దీనికి ప్రధానంగా రెండు అంశాలు కారణం అవుతాయి. ప్రతీ ఫోన్‌లోనూ రేడియో అనే చిప్ ద్వారానే మనం చేసే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, మొబైల్ డేటా లభిస్తుంటాయి. ఈ చిప్ నిరంతరం మనకు దగ్గరలో ఉండే మొబైల్ టవర్ నుంచి సిగ్నళ్లని స్వీకరిస్తూ ఉంటుంది.

ఈ రేడియో చిప్ ఖరీదైన ఫోన్‌లలో శక్తివంతంగా ఉంటుంది. తక్కువ ధర ఉన్న ఫోన్‌లలో అంత సరిగా పనిచెయ్యదు. ఈ కారణం చేతే కొన్ని ఫోన్‌లలో కాల్ క్వాలిటీ బాగుంటుంది. సిగ్నల్ క్వాలిటీ బాగుంటుంది. కొన్నింటిలో బాగుండదు. రేడియో చిప్ సరిగా డేటాని స్వీకరించలేకపోయినప్పుడు మనకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా తక్కువ వస్తుంది.

ఇక రెండో కారణం చూస్తే.. రిలయన్స్ జియో ప్రధానంగా 2300 మెగాహెర్జ్, 1800 మెగాహెర్జ్, 850 మెగాహెర్జ్ అనే మూడు ఫ్రీక్వెన్సీ బాండ్‌లలో పనిచేస్తుంది. ఒక్కో ఫోన్ ఒక్కో ఫ్రీక్వెన్సీ బాండ్‌కి కనెక్ట్ కావచ్చు. దాని వల్ల నెట్ స్పీడ్‌లో తేడా వస్తుంది. కొన్ని ఫోన్‌లు అన్ని బాండ్‌లను సపోర్ట్ చెయ్యకపోవచ్చు కూడా!

Comments

comments