ఇప్పుడు ప్రభుత్వాలు సబ్సిడీ మీద వంట గ్యాస్ సిలిండర్ ని సరఫరా చేస్తున్నాయి. అందుకే కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా వంట గ్యాస్ సిలిండర్ లని అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చినా కూడా అవి సక్సెస్ కాలేదు. జియో ఆఫర్ తో సంచనలం సృష్టించిన రిలయన్స్ కంపెనీ మరో సంచలన ఆఫర్ తో మన ముందుకు రాబోతోంది. త్వరలో వంట గ్యాస్ సిలిండర్ల రంగంలోకి అడుగుపెట్టనుంది. వంట గ్యాస్ సిలిండర్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ ని అందించాలనే ప్లాన్ లో రిలయన్స్ కంపెనీ ఉంది.
ఈ ఆఫర్ లో భాగంగా మొదట రూ.158 కే 4 కిలోల గ్యాస్ సిలిండర్ ని మార్కెట్ లోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు, ఇది సక్సెస్ అయితే మార్కెట్ లోకి డొమస్టిక్, కమర్షియల్ సిలిండర్లని కూడా తేవాలనే ప్లాన్ లో ఉంది, ఈ ఆఫర్ కనుక అమలులోకి వస్తే జియోను తీసుకొచ్చి టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన మాదిరిగానే.. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికినట్లే. ఇదిలా ఉండగా ఇక గ్యాస్ సిలిండర్ పేలుతుందేమోనన్న భయం ఇక వదిలిపెట్టేయొచ్చట. ఎందుకంటే..
గ్యాస్ సిలిండర్లు పేలి చాలామంది మృత్యువాత పడటం చూశాం. వార్తల్లో చదివాం. సిలిండర్ పేలడానికి ఎన్నో కారణాలున్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇండో గ్యాస్ సంస్థ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లను డెవలప్ చేసింది. పేలుడు స్వభావం లేని ప్లాస్టిక్‌తో ఈ సిలిండర్లను తయారు చేయడం విశేషం. సిలిండర్‌లో మొదట హైడెన్సిటీ పాలిమర్ ఎథీన్‌తో ఒక లేయర్ చేసి దానిపై గ్లాస్ ఫైబర్ వైండింగ్ ద్వారా మరో కవచంతో తయారైన సిలిండర్‌కు మరికొన్ని రసాయనాలు కలిపి వేర్వేరు టెంపరేచర్స్ వద్ద దశలవారీగా వేడి చేసి దృఢంగా రూపొందించారు.
ఈ సిలిండర్లు 5,10, 12, 15కిలోల పరిమాణంతో తయారవుతున్నాయి. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ సిలిండర్లు అన్ని టెస్టులకు క్లియరెన్స్ లభించిన తర్వాత మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. వీటి సామర్థ్యం పరిశీలించాల్సిందిగా అన్ని ప్రభుత్వ ఎల్పీజీ సంస్థలకు వీటి శాంపుల్స్‌ను అందజేసింది ఇండో గ్యాస్ సంస్థ. ప్రస్తుతం ఈ తరహా సిలిండర్లను అమెరికా, సౌత్‌కొరియా దేశాల్లో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో గ్యాస్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు దానిని కవర్ చేసే లేయర్ అడ్డుకోవడంతో పేలుడు సంభవిస్తుంది. ప్లాస్టిక్ సిలిండర్ల తయారీలో వాడిన పదార్థాలు, చేసిన విధానం వల్ల దాని లోపల ఎక్కువ వేడి లేదా పీడనం ఏర్పడినప్పుడు లోపల ఉన్న మెటీరియల్ కరిగిపోతుందే తప్ప పేలుడు సంభవించదు.
Add Comment