news

రిలయన్స్ జియో కొత్త ప్లాన్స్ వివరాలు.

రిలయన్స్ జియో వారం రోజులు ముందుగ ప్రకటించినట్టే ట్రాఫిక్ రేట్స్ పెంచింది మరియు కొన్ని ట్రాఫిక్ ప్లాన్స్ చార్జీలను తగ్గించింది. జియో పాపులర్ 84 రోజుల ప్లాన్ ఛార్జిని 15 శాతం పెంచింది. ఇంతకుముందు ఈ ప్లాన్ 399 రూపాయిలు ఉండగా ఇప్పుడు ఆ ప్లాన్నీ  459 రూపాయిలకి పెంచారు. ఇంతకు ముందు లాగానే 84రోజుల వ్యాలిడిటితో రోజుకు 1జిబి హై స్పీడ్ ఇంటర్నెట్, ఉచిత ఆన్లిమిటెడ్ కాల్స్ మరియు అన్ని జియో ఆప్స్ ఫ్రీగా వినియోగించుకోవచ్చు. అలాగే 469 ప్లాన్ ప్రవేశ పెట్టక 399 ప్లాన్ కి డేటా మరియు వ్యాలిడిట్ తగ్గించి మరో ప్లాన్ లాగా మార్చింది, ఈ ప్లాన్ లో 399 రూపాయలకి 70 రోజుల వ్యాలిడిటీతో 70 జీబీ డేటా లభిస్తుంది.

అలాగే 509 రూపాయలకు ఇంతకు ముందు 56 రోజులపాటు రోజుకి 2జీబీ డేటా పొందే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ ప్లాన్ని అదే ధరకి 49 రోజులకి తగ్గించారు. అలాగే ఇంతకు ముందు 999 రూపాయలకి 90 జీబీ డేటా 90 రోజులకి ఇవ్వగా ఇప్పుడు అదే ధరకి 90 రోజులు కలపరిమితితో 60 జీబీ మాత్రమే ఇస్తున్నారు. 1999 రూపాయల ప్లాన్ వాలిడిటీ ఆరు నెలలకి పెంచారు అలాగే ఈ ప్లాన్ కి ఇంతకుముందు 155జీబీ డేటా లభించేది కానీ ఇప్పుడు 125 జీబీకి తగ్గించారు. అలాగే 4999 రూపాయల ప్లాన్ గతంలో 210 రోజుల్లో వాలిడిటీ నుంచి 365 రోజులులకి వాలిడిటీ పెంచారు, 380 జీబీ డేటా నుంచి 350 జీబీకి తగ్గించారు.
ఇంకా అందుబాటులోకి తెచ్చిన ప్లాన్స్ విషయానికి వస్తే, 149 రూపాయల ప్లాన్ కి ఇంతకుముందు 28 రోజులకి 2 జీబీ డేటా ఇవ్వగా, ఇప్పుడు 2జీబీ డేటా ని 4.2 జీబీకి పెంచింది. అలాగే రెండు తక్కువ ధర ప్లాన్స్ ని ప్రవేశపెట్టింది, 52 రూపాయల ప్లాన్ కి 7 రోజుల వాలిడిటీతో 1 జీబీ డేటా రోజుకు 150ఎంబీ 4జి డేటా అందిస్తుంది. అలానే 98 రూపాయలకి 14 రోజుల వాలిడిటీతో 2జీబీ డేటా రోజుకు 150ఎంబీ 4జి డేటా వినియోగించుకోవచ్చు. ఈ కొత్త ప్లాన్స్ అన్ని అక్టోబర్ 19 అంటే ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయి.

Comments

comments