news

తన తల్లి గురించి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన కత్తి మహేష్..!

ఒక న్యూస్ ఛానెల్ పెట్టిన డిస్కషన్ లో పవన్ తరపున వకాల్తా పుచ్చుకున్న ఒక దర్శకుడు అసందర్భంగా కత్తి మహేష్ తల్లి ప్రస్తావన చేసిన సంగతి తెలిసిందే. అలా అడిగినప్పటి నుంచీ, కత్తి మహేష్ కుటుంబం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్, కత్తిని వీలైనంతగా బుక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కత్తి తల్లి సొంత ఊరిలో చిట్టీలు నడిపి చీట్ చేసిందని, అతడి తండ్రి వ్యవసాయాధికారిగా అవినీతికి పాల్పడ్డాడడని, సంక్రాంతి వంటి పెద్ద పండుగలకు సైతం కత్తి మహేష్ సొంత ఊరివైపు కన్నెత్తి చూడదని, ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే ఆ ఊరిలో అంత వ్యతిరేకత ఉందని… ఇలా బురద చల్లుతూ వచ్చారు కత్తి మహేష్ వ్యతిరేకులు. అతని బ్యాగ్రౌండ్ గురించి, స్వస్థలం గురించి, కుటుంబం గురించి ఆరాలు తీస్తున్నారు. ముఖ్యంగా పూనమ్, పవన్ రిలేషన్ షిప్ పై కత్తి నేరుగా 6 పదునైన ప్రశ్నలు సంధించినప్పటి నుంచి మహేష్ పై ఈ వ్యక్తిగత దాడి మొదలైంది.

ఒక ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్, మీ తల్లి గురించి చెప్పండి అంటూ ఒక దర్శకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా లేచి వెళ్లిపోయారు. దీంతో, ఆయన కుటుంబం గురించి అంతలా దాచాల్సిన విషయం ఏముంది అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కత్తి తన తల్లి గురించి స్పందించారు. తన ట్విట్టర్లో ఆమె గురించి రాసుకొచ్చారు. తన తల్లి క్యాన్సర్ తో పోరాడుతూ, రెండేళ్ల క్రితం కన్నుమూశారని, తన జీవితంలో తాను చూసిన అత్యంత ప్రేమ, దయతో కూడిన మనిషి ఆమేనని కత్తి మహేష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక్కడ ఇంకో విచిత్రం చోటు చేసుకుంది.

పూనమ్ కౌర్ కి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆయనలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే… పవన్ సింగిల్ పీస్.. అంతే… అంటూ పవన్ పై తనకు ఉన్న వల్లమాలిన ప్రేమను బహిరంగ పర్చారు. అంతేకాదు ఆయనకు నాలుగో భార్యగా తాను రెడీ అంటూ కూడా చెప్పుకొచ్చారని కత్తిమహేష్ చెబుతున్నారు. ఇక పవన్ పై ప్రేమతో కత్తి వర్సెస్ పవన్ వార్ లోకి పూనమ్ ఎంటర్ అయి అడ్డంగా బుక్కయిపోయారు. కత్తిని తిట్టిపోస్తూ ట్వీట్లు చేయడం..

మండిపోయిన మహేష్ ఆమె వ్యక్తిత్వంపైనే ప్రశ్నలు సంధించడం, ఆ తర్వాతి దుమారం తెలిసిందే. కత్తికి మరోసారి ట్వీట్ చేశారు.. పూన‌మ్.. అయితే అది ఆయనకు సమర్థనగా.. మహేష్ తల్లి టార్గెట్ గా నడుస్తున్న వివాదంపై స్పందిస్తూ.. ఎవ‌రైనా కానీ, ఓ వ్య‌క్తి త‌ల్లిని కించ‌ప‌రుస్తూ ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌దు. ద‌య‌చేసి ఆమె గురించి మాట్లాడ‌కండి అని పూన‌మ్ ట్వీట్ చేసింది.. ఓ మహిళ పట్ల పూనమ్ చేసిన ట్వీట్ అందరికి నచ్చింది.. అలాగే పూనమ్ ట్వీట్ కు కత్తి రిప్లై కూడా ఇచ్చాడు.. పూనమ్ చేసింది Very matured tweet 👏👏 అంటూ ట్వీట్ చేశాడు..

Comments

comments