health

ముద్దూముచ్చట ఒంటికి మంచిదట!

మనిషి ఆనందంగా ఉన్నడనే దానికి పెదాలపై చిన్న చిరునవ్వు చాలు. అలాగే ప్రేమను వ్యక్త పరిచేందుకు ఒక ముద్దు చాలు. లిప్ కిస్, బుగ్గపై చుంబనం వంటి ఎన్నో రకాలైన ముద్దులున్నాయి. మనిషి శరీరంలోని ఒక్కో భాగంలో పెట్టే ముద్దుకు వైద్యశాస్త్ర ప్రకారం ఒకో ఆర్ధం ఉంది. భార్యభర్తలు, ప్రేమికులు ఒకరి నొకరు ముద్దాడడం చూస్తునే ఉంటాం. పెద్దలు పిల్లల్ని ముద్దు చేయడమూ మామూలే.

సినిమాల్లో లిప్ కిస్, ముద్దులు సీన్లు వచ్చినప్పుడు కొందరు ఇబ్బంది పడతారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ముద్దు పెట్టు కునేందుకు కొందరు ఇష్టపడతారు, మరికొందరు ఇందుకు దూరంగా ఉంటారు. అయితే ఒక తీయని ముద్దు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. లిప్ లాక్, లేక మామూలు చుంబనం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఈ ముద్దులు గుండెకు, ఊపిరి తిత్తుల తోపాటు మొత్తం ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయని నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది.’

ఇటీవల ‘కిసెంజర్‌’ అనే పరికరాన్ని లండన్ లోని సిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఎదుటివారికి ఫోన్ ద్వారా ఈ పరికరంతో ముద్దు పంపితే.. అవతలి వ్యక్తికి నిజంగానే ముద్దు పెట్టిన అనుభూతి కలుగుతుందట.

 

లిప్ కిస్ మనల్ని ఒత్తిడిని దూరం చేస్తుందట. ముద్దు పెట్టుకునేటప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలయి మనసును ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఎండార్ఫిన్ హార్మోన్ అయితే మంచి అనుభూతిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దు.. కొవ్వును కూడా కరిగిస్తుందట.

ఒక నిమిషం పాటు గాఢంగా ముద్దు పెడితే శరీరంలో 26 కేలరీలు కరుగుతాయట. కొవ్వును తగ్గించడంతో పాటు బీపీని నియంత్రించడం, గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేం దుకు తోడ్పడడం ముద్దు వల్ల కలిగే లాభాలని చెబుతున్నారు. ఒక ముద్దుతో తలనొప్పి లాంటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

లిప్ కిస్ చేసేటప్పుడు 34 ముఖ కండరాలు కదలుతాయట. వీటి కదలికలతో ముఖంపై చర్మానికి ఎక్సర్ సైజ్ అవుతుందట. శ్వాసక్రియకు సంబంధించిన సమస్యలను కూడా కిస్ దూరం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముద్దు… ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు మనలో పునరుత్తేజాన్ని కలిగిస్తుంది. భాగస్వామితో ఎలాంటి కలహాలు లేకుండా సంసారం సాఫీగా సాగేందుకు ముద్దే ప్రధాన భూమిక పోషిస్తుందట.

ప్రతిరోజు ముద్దు పెట్టుకోవడ వల్ల ఆయుష్షు మరో ఐదేళ్లు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటు న్నారు. తల్లి- బిడ్డ, ప్రేమికుడు- ప్రియురాలు, భార్యా-భర్తలు నిరభ్యంతరంగా పెట్టు ముద్దు పెట్టుకోవచ్చు. ముద్దు వల్ల ఆరోగ్యానికి ప్రయోజనమే ఉంది కాబట్టి.. మీరు కూడా ముద్దుల వర్షంలో తడవండి.

Comments

comments