movies

తాటతీస్తానంటూ వర్మకు వార్నింగ్… ఆమె సూపర్!!!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా సేన్సేషనల్ చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. సీనియర్ ఎన్టీఆర్ జీవితకధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను వర్మ చాలా ఆసక్తికరంగా తీస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగుపెట్టిన దగ్గర్నుండీ ఈ సినిమా మొదలవుతుందని ముందే చెప్పేశాడు వర్మ. అయితే ఇప్పుడు వర్మకు గట్టి వార్నింగ్ ఇస్తోంది లక్ష్మీ పార్వతి.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వర్మ చేస్తున్న సినిమా కోసం తనను ఎవ్వరూ కలవలేదని ఆమె పేర్కొంది. వర్మ ఈ సినిమా చేయడం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వేరేలా చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది. తన ఆత్మా గౌరవాన్ని దెబ్బతీసేలా సినిమా చేస్తే తప్పకుండా వ్యతిరేకిస్తానని, తనలోని పాత లక్ష్మీ పార్వతిని చూస్తారని హెచ్చరించారు.

2018లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. అక్టోబర్ నాటికి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదన్న వర్మ, తమ సినిమాలో కేవలం ఒక అధ్యాయాన్ని మాత్రమే చూపిస్తామని తెలిపారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా మొదలవుతుందని తెలిపారు.

ఇలా వర్మ తాటాతీస్తానంటూ లక్ష్మీ పార్వతి వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి ఈ విషయంపై వర్మ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Comments

comments