movies

‘మర్సల్’ ఫస్ట్‌వీక్ కలెక్షన్స్.. వామ్మో ఏకంగా 178 కోట్లా!!!

తొలిరోజు విజయ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి ‘నాన్-రజినీ’ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాతిరోజుల్లోనూ అదే దూకుడుతో బాక్సాఫీస్‌ని ఉతికారేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్‌‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్నాడు

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మర్సల్’ సినిమాకి రివ్యూలు గొప్పగా ఏమీ రాలేదు. టాక్ కూడా యావరేజ్‌గానే వచ్చింది. ఇక క్రిటిక్స్ అయితే.. రిలీజ్‌కి ముందు యూనిట్ డప్పు కొట్టుకున్నంత ఇందులో ఏమీ లేదని, కేవలం రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ అని అనుకున్నారు. సాధారణంగా ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు కలెక్షన్లు కూడా డీసెంట్‌గానే వస్తాయి. అలాంటి దాఖలాలున్నాయిలెండి. ‘మర్సల్’ది కూడా అదే బాపతు అని భావించారు. కానీ.. ఆ ఊహాగానాల్ని పటాపంచలు చేస్తూ ఈ చిత్రం సెన్సేషలన్ కలెక్షన్స్ కొల్లగొడుతోంది.

ఈ దెబ్బకు ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.100 కోట్ల గ్రాస్ వచ్చేసింది. అంతటితో ఆగలేదండోయ్.. వీకెండ్స్‌లోనూ ఈ చిత్రం దుమ్ము దులిపేసింది. దీంతో.. ఈ చిత్రం కేవలం ఫస్ట్ వీక్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.178 కోట్లు నమోదు చేయగలిగింది. ఇక షేర్ విషయానికొస్తే.. రూ.94 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కేవలం తమిళనాడులోనే ఈ మూవీ రూ.50 కోట్లకుపైగా షేర్, రూ.87 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. దేశవ్యాప్తంగా రూ.63 కోట్లు షేర్, రూ.117 కోట్ల గ్రాస్ సాధించింది.

మరో గొప్ప విషయం ఏంటంటే.. తమిళ చిత్రాలకు అంతగా పట్టులేని అమెరికాలోనూ ఈ చిత్రం చితక్కొట్టేసింది. ఇప్పటివరకు రూ.9.4 కోట్లు గ్రాస్, రూ.4.7 కోట్లు షేర్ వసూలు చేసి.. ‘కబాలి’ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా మరో ఘనత సాధించింది. మిగతా దేశాలన్నింట్లో కలిపి రూ.26 కోట్ల షేర్, రూ.52 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అంతగా ప్రోత్సాహకరంగా రివ్యూలు రాకపోయినా, క్రిటిక్స్ పెదవి విరిచినా, టాక్ కూడా గొప్పగా లేకపోయినా.. ఈ రేంజులో ప్రభంజనం సృష్టించిందంటే అది విజయ్ ఘనతేనని అంటున్నారు. అలాగే.. జీఎస్టీ, వైద్యుల, దేవాలయాలపై పేల్చిన డైలాగులు వివాదాస్పదమవడం.. వాటి మీద రగడ జరగడం.. కూడా సినిమాకు మంచి పబ్లిసిటీనే తెచ్చిపెట్టాయి.

Comments

comments