health

గోరింటాకు పెట్టుకోవడం వాళ్ళు అందమే కాదు, ఎన్ని ఆరోగ్య ప్రయేజనాలు ఉన్నాయే !!

గోరింట

భారతీయ సంస్కృతి కి నిదర్శనంగా పూర్వం నుండి నేటి వరకు మహిళలకు ఇష్టమైనది గోరింటాకు .భారతీయ మహిళలకు గోరింటాకు అంటే చెప్ప‌లేని మ‌క్కువ‌. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికి మన వాళ్ళు గౌరవిస్తున్నారు. పెళ్ళికి నెలరోజుల ముందునుండే మెహంది పండగ చేస్తుంటారు.పెళ్లి అనే కాదు ఏ పండగ వచ్చిన చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.ప్రతి పండగకు ఆడవాళ్ళ చేతులకు అందం గోరింటాకు.మన దేశంలోనే కాదు. విదేశీ వనితలకు కూడా మెహంది అంటే చాల ఇష్టపడతారు. పండగలంటే ఆడవాళ్ళకి గుర్తొచ్చేది మెహంది. టైం ఎక్కువ లేదు పెద్ద పెద్ద డిజైన్స్ వేసుకోలేము అనుకునే వాళ్ళకోసం కొన్ని సింపుల్ డిజైన్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

గోరింటాకు ఎర్ర‌గా పండాలంటే

గోరింటాకు ఎర్రగా పండాలంటే.. సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరి. శుభ్రంగా ఉన్న చేతులపై మెహందీ అప్లై చేయడం చాలా అవసరం. మెహందీ పెట్టుకోవడానికి ముందు సోప్ వాటర్ తో చేతులను క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల మెహందీ ఎక్కువ సేపు మీ చేతులపై ఉంటుంది.. బాగా పండుతుంది. మెహందీ పెట్టుకున్న తర్వాత చేతులపై నిమ్మరసం, పంచదార కలిపిన మిశ్రమం కాటన్ తో అద్దుకోవాలి. దీనివల్ల డిజైన్ ఆరిపోకుండా, రాలిపోకుండా ఉంటుంది. అలాగే నిమ్మరసంలో ఉండే సిట్రస్ ఎర్రగా పండటానికి సహాయపడుతుంది.

గోరింట‌తో ఎంతో మేలు

గోరింటాకు పెట్టుకుంటే మహిళలు ఎంతో చూడముచ్చటగా కనిపిస్తారు. అయితే గోరింటాకు అందానికేకాదు మన ఆరోగ్యానికి కూడా సహాయపడుతుందంని తెలిపారు ఆరోగ్య నిపుణులు. గోరింటాకులో ఉండే ఔషధగుణాలు మన శరీరాన్ని రక్షించి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కంటికి కనిపించని సూక్ష్మక్రిములను గోరింటాకుతో నాశనం చేయవచ్చు. ఆటలమ్మ సోకేటప్పుడు శరీరంపై వచ్చే మచ్చలకు గోరింటాకు పూయడం వల్ల ఆ మచ్చలను దూరం చేయవచ్చు. అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళకు, వేళ్లకు ఉండే ఇన్‌ఫెక్షన్‌ను దరిచేరనీయకుండా చేస్తుంది. అంతేకాదు ఒంటిపై ఏవైనా గాయాలు అయినప్పుడు గోరింటాకు ముద్దగా చేసి గాయాలకు రాస్తే, మంచి ఫలితం ఉంటుంది. గోరింటాకు రుబ్బి తలకు రాసుకుంటే చుండ్రు సమస్యను దూరంచేసి జుట్టు బలపడేందుకు తోడ్పడుతుంది. మృదువైన, ఒత్తైన జుట్టును అందిస్తుంది.

ఉపయోగాలు

1. గోరింటాకు రసాన్ని,చక్కర కలుపుకొని తాగినట్లయితే మంటతో కూడిన మూత్ర విసర్జన మరియు మలబద్దకాన్ని నివారించవచ్చు.
2. గోరింటాకు ఆకులతో కషాయం కాసి,కాలిన గాయాలపై వేసినట్లయితే ఉపశమనం కలుగుతుంది.
3. గోరింటాకుని ముద్దగా చేసి ,అందులో కొద్దిగా నూనె మరియు తుమ్మ జిగురు కలిపి కణతల మీద పెట్టుకునట్లయితే తల నొప్పి తగ్గుతుంది.
4. ఒక గ్లాసు పాలలో అందులో రెండు చెంచాలు గోరింటాకు రసాన్ని కలిపి తాగితే చలి జ్వరముకి మంచి ఉపశమనం లభిస్తుంది.
5. దంత సమస్యలకు మరియు చిగుళ్లలో రక్తం కారుట అటువంటి వాటికీ గోరింటాకు కషాయాన్ని నోటిలో వేసికొని పుక్కిలిస్తే మంచి ఫలితం కలుగుతుంది.

Comments

comments