news

పూనమ్‌కౌర్‌పై సంచలన ప్రకటన చేసిన మంత్రి

కత్తి మహేష్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు జరుగుతున్న వివాదం మధ్యలో హీరోయిన్ పూనమ్ ఎంట్రీ ఇచ్చింది.. దీంతో కత్తి మహేష్ పూనమ్ మీద కూడా రెచ్చిపోయాడు.. మీ ఇద్దరి గుట్టు బయట పెడతా అంటూ వ్యాఖ్యలు చేశాడు.. నాకు పూనమ్ సమాధానం చెప్పాలంటూ ఓ 6 ప్రశ్నలు అడిగాడు..

అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నిన్ను ఎవరు సిఫార్సు చేశారని చేశారని ప్రశ్నించారు.. దీంతో పెద్ద వివాదం మొదలయింది.. అయితే తాజాగా పూనమ్ మీద ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ప్రకటన చేశారు…

నేను మంత్రిగా ఉన్న సమయంలో చేనేత వస్త్రాలకు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదని తేల్చి చెప్పారు.. అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదని ఆయన అన్నారు.. ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చ జరగలేదని, కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయనను కలిసి కోరారని తెలిపారు.

అంతే తప్ప.. చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.. మంత్రి ప్రకటనతో వివాదం కొత్త మలుపు తిరిగింది. దీనిపై పూనమ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Comments

comments