movies

అనసూయతో మోహన్ బాబు రొమాన్సా!!

అటు యాంకర్ గాను.. ఇటు యాక్టర్ గాను బిజీ అయిపోతున్న అనసూయ… ఇప్పుడు మోహన్ బాబు మూవీలో కీలక పాత్రకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మూవీ అంతా హీరో వెంట ఉండే ఓ జర్నలిస్ట్ పాత్ర ఉంటుందట. దీని కోసమే అనసూయను అప్రోచ్ కావడం.. ఆమె కూడా సై అనేయడం జరిగిందని అంటున్నారు. 

మంచు మోహన్ బాబు తన కొత్త సినిమా షూటింగ్ ను చకచకా ఫినిష్ చేసేస్తున్నారు. గాయత్రి అనే 
టైటిల్ పై రూపొందనున్న ఈ చిత్రాన్ని…. తండ్రీకూతుళ్ల రిలేషన్ అనే థీమ్ తో తెరకెక్కిస్తున్నారు. నిఖిలా విమల్ మోహన్ బాబు కూతురుగా నటిస్తోండగా… ఇప్పుడీ సినిమాలోకి హాట్ బ్యూటీ సడెన్ ఎంట్రీ ఇచ్చింది.

జర్నలిస్ట్ రోల్ కీలకమే కాకుండా… హీరో పాత్రతో రొమాన్స్ యాంగిల్ కూడా ఉంటుందట. అంటే మోహన్ బాబు- అనసూయ కేరక్టర్లపై ఒకట్రెండు పాటలు కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

ఇటు కుర్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు.. ఓ ఐటెం సాంగ్ లో కూడా కనిపించిన అనసూయ.. ఏకంగా మోహన్ బాబుతో రొమాన్స్ చేసేందుకు అంగీకరించడమే హాట్ టాపిక్ అవుతోంది. అయితే.. కథ పరంగా తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ ను బేస్ చేసుకుని.. గాయత్రి చిత్రంలో నటించేందుకు అంగీకరించిందట అనసూయ. 

Comments

comments