movies

విమర్శకులపై పూరి జగన్నాథ్ పంచ్ డైలాగ్..

కమర్షియల్ ఫైట్స్, ఐటమ్ సాంగ్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాలతో సినిమా తీస్తే.. పూరి మళ్లీ అదే తీశాడంటారు. కొత్తగా తీయలేడా? అని ప్రశ్నిస్తారు. కొత్తగా తీస్తే.. పూరి మార్క్ మిస్ అయ్యిందని కంప్లయింట్ చేస్తారు – ఈ రోజు జరిగిన ‘మెహబూబా’ థాంక్యూ మీట్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పిన మాట!

ఇది ఖచ్చితంగా విమర్శకులపై సెటైర్ లేదా పంచ్ డైలాగ్ అనుకోవాలి. తనయుడు ఆకాష్ పూరిని హీరోగా రీ ఇంట్రడ్యూస్ చేస్తూ, పూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మెహబూబా’ విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. పూరి కొత్తగా తీయాలని ప్రయత్నించాడు గానీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడనీ.

దీని బదులు ఆయన రెగ్యులర్ స్టయిల్‌లో సినిమాలు తీస్తే మంచిదనీ చాలామంది అభిప్రాయపడ్డారు. అటువంటి వాళ్లందరిపై పూరి డైలాగ్ వేశాడన్నమాట. ఈ థాంక్యూ మీట్‌లో సినిమాకు ఆదరణ బాగుందని సినిమా టీమ్ అందరూ చెప్పుకొచ్చారు.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ..ఈ పేరు చెపితే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తుకొస్తాయి. పవన్‌కళ్యాణ్‌ తో ‘బద్రి’, మహేష్‌ బాబుతో ‘పోకిరి’, ప్రభాస్‌తో ‘బుజ్జిగాడు’, ఎన్టీఆర్‌ తో ‘టెంపర్‌’, రామ్‌ చరణ్‌ ‘చిరుత’, బన్నితో ‘దేశముదురు’, రవితేజతో ‘ఇడియట్‌’ ఇలా టాప్ హీరోలందరితో సినిమాలు తీసి సూపర్‌హిట్స్‌ కొట్టాడు. తన హీరోలకి సెపరేట్‌ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసి సినిమాలు చేయడం లో పూరి తర్వాతే ఎవరైనా..పూరి నుండి సినిమా అంటే హీరోలు సైతం ఎంతో ఆసక్తి కనపరించేవారు..

ప్రస్తుతం పూరి తన మార్క్ చూపించడం లో విఫలం అవుతూ వస్తున్నాడు. ఏమాత్రం కథ ఫై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు..ఏదో నాల్గు పంచ్ డైలాగ్స్ , ఓ ఐటెం సాంగ్ , హీరోయిన్ ను కాస్త సెక్సీ గా చూపించడం , హీరోయిన్ తో నాల్గు బూతు డైలాగ్స్ చెప్పించడం తప్ప ఆకట్టుకునే కథ , ఎమన్నా తీసాడా అనే చెప్పుకునేంత కథ మాత్రం రాయలేకపోతున్నాడని పబ్లిక్ అంటున్నారు.

ఈ మధ్య అయితే పూరి మరి దారుణం గా తయారయ్యాడని అసలు పూరి నుండి ఎప్పుడు సినిమా వస్తుందో , ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదని అభిమానులు అంటున్నారు

Comments

comments