జీఎస్టీ బాదుళ్ళు మొదలయ్యాయి అవును తెలంగాణ రాష్ట్రం లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొత్త ధరలు 27-6-2017 నుండి అమల్లోకి వస్తాయి. కొత్త ధరల వివరాలు కనిష్టంగా 10/- రూ, గరిష్టంగా 20/- రూ పెంచుకునేందుకు థియేటర్ల కు అనుమతిచ్చింది. మల్టీప్లెక్సుల్లో కనీసం 20 శాతం సీట్లు లోయర్ క్లాస్ కు కేటాయించాలని నిబంధన. జీహెచ్ఎంసీ పరిధి లో ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ రూ 120/-, లోయర్ క్లాస్ రూ 40/- . నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ రూ 60/- లోయర్ క్లాస్ టికెట్ రూ 20/-.
మునిసిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర రూ.80/- లోయర్ క్లాస్ రూ.30/-. నం ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర రూ.60/-, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ.20/-. నగర, గ్రామ పంచాయితీల్లో ని ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర రూ.70/-, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ.20/-.
నాన్ ఏసీ థియేటర్ల ఆధురీకరణకు టికెట్ పై రూ.5/- నుండి రూ.7/- వరకు పెంచుకునే వెసులుబాటు. ఏసీ థియేటర్లో టికెట్ పై రూ.2/- నుండి రూ.7/- పెంచేందుకు అనుమతి.
Add Comment