news

మల్టీప్లెక్స్ హాళ్లకు ఇక నుండి ఇంటి ఆహారం తీసుకెళ్లొచ్చు

ఇకనుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ ల్లోకి ఇంటి ఆహారాన్ని తీసుకెళ్లొచ్చని ప్రకటించింది.మహారాష్ట్రలో సినిమా ప్రియులకు ఆ రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. ఇంటి ఆహారాన్ని తెచ్చుకునే వారిని సినిమా థియేటర్ల సిబ్బంది అడ్డగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్‌ లలో తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారు. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో సినిమా హళ్లలో అమ్మే స్నాక్స్ పైన ఓ పాలసీని తయారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొన్ని రోజుల క్రితం మల్టీప్లెక్స్ ల్లో తినుబండారాలు అధిక రేట్లకు అమ్ముతున్నారని బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

 

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

comments