movies

నాగ్ దెబ్బతో వర్మకు బాగా పడింది !!! నాగ్ దెబ్బ వర్మ అబ్బా !!

అక్కినేని నాగార్జునతో డాషింగ్  సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేస్తాడనే విషయం ఇటీవల టాలీవుడ్‌లో షికారు మరియు  హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ వార్తను నిజం చేస్తూ వర్మతో పాటు నాగ్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్‌గా పోతుంది.

ఇక వర్మ సినిమాలో నాగ్ నటిస్తుండటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను నాగ్ స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తాడని అనుకున్నారు అందరు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నాగ్ ఈ సినిమాలో తాను కేవలం నటిస్తానని, తాను రెమ్యునరేషన్ తీసుకుంటానని వర్మతో చెప్పేశాడట. ఈ మాటలకు వర్మ ఫ్యూజులు ఔట్ అయ్యాయట. చేసేది ఏమీ లేక వర్మ ఈ చిత్రాన్ని ‘కంపెనీ’ బ్యానర్‌పై తానే స్వయంగా నిర్మిస్తాడట.

పాతికేళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన శివ సినిమా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో రానుండటంతో ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆసక్తిగా ఉంది.

వర్మ-నాగ్ కాంబోలో రానున్న సినిమాను నవంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నానని వర్మ మీడియాకు తెలిపాడు. మరి ఈ సారి వర్మ ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.

 

Comments

comments