Business

బీర్లతో ఇక కార్లు నడుస్తాయ్!

లండన్: బైకులు, కార్లు నడవాలంటే ఇక పెట్రోల్‌తో పనిలేదు. అందుకోసం క్యూలలో వేచి ఉండాల్సిన అ వసరం అంతకన్నా ఉండబోదు. బీరు ఉంటే చాలు. వినడానికి నవ్వుతెప్పిస్తున్నా, బీరు నుంచి సరికొత్త ఇంధనాన్ని బ్రిటన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రవాణాకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నా యంపై అన్వేషణ చేపట్టిన శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనల్లో విజయవంతంగా ఈ విధానం కొనుగొన్నారు. అల్కహాల్‌లోని ఇథనాల్ కీలకమవుతుంది. ఇథనాల్‌ను బ్యుటనాల్‌గామార్చి పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం సృష్టించడంలో విజయం సాధించాం. స్వ భావ రీత్యా తక్కువ శక్తి గల ఇథనాల్ సులువుగా నీటి లో కలిసిపోతుంది.

ఇథనాల్ ముడిపదార్థాన్ని పెట్రోల్‌గా వినియోగిస్తే పెద్దమొత్తంలో నష్టాలు కలుగుతాయి. అందుకే ఇథనాల్‌ను బ్యుటనాల్‌గా మార్చడం తో ఫలితాలు అద్భుతంగా వచ్చాయి అని పరిశోధనకు నేతృత్వం వహించిన బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డంకన్ వాస్ చెప్పారు. ప్రస్తుతం బీరు నుంచి ఇంధన తయారీ ప్రయోగశాల దశలోనే ఉందని, దీన్ని మరింత మెరుగుపరిస్తే, పారిశ్రామిక స్థాయికి తీసుకువెళ్లవచ్చని వాస్ తెలిపారు. మద్యం అన్నింటిలోకన్నా బీర్ మంచి రసాయన సమ్మేళనమని, దాని నుంచి బ్యుటనాల్‌ను సులువుగా తయారు చేయొచ్చని పరిశోధకులంటున్నారు.

Comments

comments