గ్లామర్ పాత్రలకే కాదు అటు డీ గ్లామర్ పాత్రలలోను ఇటు లేడీ ఓరియెంటెడ్ పాత్రలలోను నటించి మెప్పించ గల నటి అనుష్క.అందులో ఆమె చాలా నాజూకుగా, సరికొత్త హెయిర్ కట్‌తో కనిపించారు. ఏదో అద్భుతం జరగడం వల్ల కలలు నెరవేరవు, దాని కోసం చెమట చిందించాలి, అంకితభావంతో కృషి చేయాలి అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫొటో చూసిన అభిమానులు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా అంకితభావంతో పనిచేస్తున్నారు, సూపర్, క్యూట్ స్వీటీ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సైజ్‌జీరో చిత్రంలోని తన పాత్ర కోసం అనుష్క కష్టపడి బరువు పెరిగి ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రం కోసం బరువు తగ్గడానికి ప్రయత్నించారు కానీ పూర్తిస్థాయిలో సన్నబడలేకపోయారు. ఈ కొత్త ఫొటోను చూస్తుంటే అనుష్క తిరిగి ఇంతకు ముందులా తయారైనట్లు కనబడుతోంది.
‘బాహుబలి 2’ తర్వాత అనుష్క ‘భాగమతి’ చిత్రంలో నటిస్తున్నారు. జి. అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఇక అనుష్క తన ఫోటోకి ఓ కామెంట్ పెట్టి..కల నిజం కావాలి అంటే మాయలు , మంత్రాలు పనికిరావు. కష్టపడేతత్వం, కృత నిశ్చయం ఉండాలి. ఇందుకోసం ఎంత చెమటనైన దారపోయాలని అని అంది. అంటే కష్టించాలే కాని దక్కనిదంటూ ఏదీ లేదనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్ గా చెప్పిందని అందరు చర్చించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే అనుష్క నెక్ట్స్ సినిమా నాగ్‌తో ఉంటుందని ఇటీవల వార్తలు రాగా,ఈ మూవీ కోసమే అనుష్క ఇలా మారిందా అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
Add Comment