news

మగాళ్ళని వేదించే ఆడవాళ్లు ఇక జైలుకే …

కొద్ది రోజుల క్రితం వరకు ఆడవాళ్లను మగవాళ్లు వేధించడం లాంటి వార్తలు మాత్రమే వినేవాళ్లం… చూసేవాళ్లం… అలాగే భార్యను చంపిన భర్త అనే వార్తలుండేవి. కాని ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు కొందరు ఆడవాళ్లు కూడా ఎంతలా తెగించి ప్రవర్తిస్తున్నారో…. ప్రియుళ్ల కోసం భర్తలను చంపిన ఆడవాళ్లను ఎందరిని చూడలేదు. చివరి రెండు నెలల కాలంలోనే పది మంది ఆడవాళ్లు తమ భర్తలను చంపారు. అదీ అక్రమ సంబంధాల కోసమే.. స్వాతి, జ్యోతి, శ్రీవిద్య కేసులు ఎంతలా సంచలనమయ్యాయో అందరికీ తెలిసిందే. అత్యాచారం, లైంగిక వేధింపులు, వెంటాడటం, ఇతరుల లైంగిక కార్యకలాపాలను చూసి ఆనందించడం.. తదితర నేరాల్లో మహిళలకు కూడా శిక్షలు విధించాలనే వాదన ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

ప్రముఖ లాయర్‌ రిషి మల్హోత్రా… ఇటీవలికాలంలో లైంగిక హింసను ఎదుర్కొంటున్న పురుష బాధితుల సంఖ్య పెరిగిపోతున్నందున.. మహిళలకు కొనసాగుతోన్న మినహాయింపులను రద్దుచేయాలని, ఆ మేరకు చట్టాల్లో సవరణలు చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. నేరాలకు లైంగికబేధం ఉండదు కానీ చట్టాలు మాత్రం ఇంకా ఆ బేధాన్ని కొనసాగించేలా ఉన్నాయంటున్నారు ఆయన. అందుకే వాటిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

వివాహేతర సంబంధాల విషయంలో మహిళల భాగస్వామ్యం ఉన్నప్పటికీ పురుషులకు మాత్రమే శిక్షలు పడుతున్నాయన్న వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని పరిశీలించాలని, ఆ మేరకు విధానాన్ని తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశంలో ప్రతి 222 మంది పురుషుల్లో 16.1శాతం మంది బలాత్కారానికి గురవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇప్పటికిప్పుడు ఒక మగవాడు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదుచేస్తే కేసు నమోదుకాని పరిస్థితి. ఎందుకంటే 158 ఏళ్ల కిందట బ్రిటిష్‌ కాలంలో రూపుదిద్దుకున్న చట్టాల ప్రకారం అత్యాచారం, లైంగిక వేధింపులు, వెంటాడటం, ఇతరుల శృంగార కార్యకలాపాలను చూసి ఆనందించడం తదితర నేరాలలో మహిళను నిందితురాలిగా గుర్తించరు. కేవలం బాధితురాలిగానే గుర్తిస్తారు. అందుకని చట్టంలో మార్పు రావాలంటూ ఈ పోరాటం మొదలయ్యింది. ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.

Comments

comments