movies

నేనే రాజు నేనే మంత్రి

ఆగష్టు  11న  ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రానా దగ్గుబాటి నటించిన 19వ చిత్రం  నేనే రాజు  నేనే మంత్రి. తేజ దర్శకత్వం లో సురేష్ బాబు నిర్మాత గా సురేష్ ప్రొడక్షన్స్ నుండి విడుదలవుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, కాజల్, కేథరిన్ హీరోయిన్లు. బాహుబలి విజయం తో అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించిన భల్లాలదేవ. ఈ సంవత్సరం ఘాజి తో హిట్ అందుకున్న రానా రెండో చిత్రం తో మరో హిట్ అందుకోబోతున్నాడు.

ఈ చిత్రం లో  రానా  జోగేంద్ర పాత్ర పోషిస్తుండగా కాజల్ రానాకు భార్య పాత్ర పోషిస్తుంది. రాజకీయ నేపథ్యం తో రానా మన ముందుకు రాబోతున్న రెండో చిత్రం. లీడర్ సినిమా లో పాజిటివ్ రోల్, నేనే రాజు నేనే మంత్రి లో నెగటివ్ రోల్ పోషిస్తున్నా రానా. ఈ చిత్ర కథ తమిళనాడు రాజకీయాల్ని ఉద్దేశించి ఉండడం గమనార్ధం.

Comments

comments