శాన్ఫ్రాన్సిస్కో: ఆపిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐ ఫోన్ ఎక్స్‌పైతాజా మరో షాకింగ్న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది.కొంతమంది కొన్ని గంటలపాటు క్యూలో నిలబడి ఐఫోన్ ఎక్స్ ను కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ కోసం.. ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మొబైల్ ధర భారత్ లో 89వేల రూపాయల నుండి లక్ష రూపాయల పైనే ఉంది. అయితే దొంగలు మాత్రం ఏ బ్యాంకుకో కన్నం వేయకుండా ఏకంగా 300 ఫోన్లను కొట్టేశారు.
అతిఖరీదైన హైఎండ్ స్మార్ట్‌ఫోన్ ఐ ఫోన్ ఎక్స్ భారీగా చోరీకి గురికావడం కలకలం రేపింది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఆపిల్ స్టోర్‌లో ఈ దొంగతనం జరిగింది. సుమారు మూడు వందలకుపైగా ఆపిల్ హాట్ ఫోన్ ఐ ఫోన్ ఎక్స్ డివైస్‌లను చోరులు అపహరించుకుపోయారు.
ఈ ఘటన శాన్ ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకుంది. దాదాపు 3,70,000 అమెరికన్ డాలర్ల విలువైన ఐఫోన్ ఎక్స్ ఫోన్లను కొట్టేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని యాపిల్ స్టోర్ ముందు యూపీఎస్ కంపెనీకి చెందిన ట్రక్కు నిలిపి ఉంచారు. అందులో నుండి యాపిల్ ఫోన్లను స్టోర్ లోకి తరలిస్తున్నారు. ఇంతలో ముగ్గురు దొంగలు ఎక్కడి నుండి వచ్చారో ఏమో కానీ వాటిని దొంగిలించుకొని వెళ్ళిపోయారు.
పోలీసులు అందించిన నివేదిక ప్రకారం 313 డివైస్‌లు చోరీకి గురయ్యాయి. ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఆపిల్ స్టోర్ముందు పార్కింగ్ చేసిన యూపీఎస్ ట్రక్‌ను అటకాయించి వీటిని ఎత్తుకెళ్ళారు.ఈ ఘటనపై అటు యూపీఎస్సంస్థ, ఇటు ఆపిల్ విచారణ చేపట్టింది.
64జీబీ వేరియంట్లు
అవన్నీ 64జీబీ వేరియంట్లు కావడం విశేషం. సాధారణంగా ఐఫోన్లలో ఫైండ్ మై ఐఫోన్ అనే రిమోట్ లాక్ అవుట్ ఫీచర్ ను ఇంస్టాల్ చేస్తారు. అలా ఉంటే ఫోన్ ఎక్కడ ఉన్నా కనుగొనేయచ్చు. అయితే ఈ ఫీచర్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేయకముందే కొట్టేయడంతో ఈ ఫోన్లను కనిపెట్టడం కష్టమేనట..! ప్రస్తుతం ఈ దొంగలను పట్టుకునే వేటలో శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు పడ్డారు.
భారత మార్కెట్లో నవంబర్ 3 సాయంత్రం. 6గంటలనుంచి ఐ ఫోన్ ఎక్స్ రూ.89వేల ప్రారంభ ధరనుంచి విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 3 ముందు అక్టోబర్ 27 ప్రీ ఆర్డర్ ప్రారంభించినప్పుడు నిమిషాల్లో ఐ ఫోన్ ఎక్స్ ఫోన్లు ఔట్ ఆఫ్స్టాక్గా నిలిచిన సంగతి తెలిసిందే.
Add Comment