news

కత్తిని ఏం చేద్దాం… పవన్ ఏమన్నారంటే?!!

రోజు రోజుకు రచ్చరచ్చ అవుతున్న కత్తి మహేష్ ఎపిసోడ్ కు ఎక్కడ పులుస్టాప్ పెట్టాలి. అసలు దాన్ని ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు జనసేన ఎదుట ఉన్న ప్రశ్నలివి. కత్తి మహేశ్ చేస్తున్న వ్యాఖ్యలు… దానికి పవన్ ఫాన్స్ ఇస్తున్న ప్రతిఘటన వెరసి తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారమే అవుతోంది. ఆదివారం హైద్రాబాద్ లో ఒకవైపు కత్తి మహేష్ మరో వైపు పవన్ ఫాన్స్ ఎదురెదురు మోహరించి ఉద్రిక్తతలు సృష్టించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని పవన్ ఫ్యాన్స్ ని అదుపు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కత్తి విమర్శలకు ఎలా తెర వేయాలి అనే దానిపై జనసేన దృష్టి పెట్టినట్లు తెలిసింది.

ఆదివారం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో సమావేశం అయిన ఆ పార్టీ నేతలు… ఈ విషయాన్ని పవన్ దృష్టికి తెచ్చారని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే కత్తి మహేశ్ వ్యవహారంపై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్‌ను పవన్‌తో జత చేస్తూ కత్తి చేసిన ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు ఆదివారం పవన్‌ను కలిసి కత్తి మహేశ్ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. అన్నీ చర్చించిన తరువాత మహేశ్ ఆరోపణలపై ఓ నిర్ణయానికి వచ్చిన జనసేన నేతలు.. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కత్తి మహేశ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చారు.

అంతేకాదు మహేశ్ ఆరోపణలపై ఎవరూ స్పందించొద్దంటూ పార్టీ శ్రేణులకు, అభిమానులకు సందేశం పంపారు. ఇక కత్తి విమర్సలపై జబర్దస్త్ నటుడు హైపర్ అది స్పందించారు. ఇక ని పని ఐపోయిందంటూ ఓ ట్వీట్ పెట్టారు. ‘‘మరి వేణు అన్న లైవ్‌లో చెప్పాడుగా మైండ్ దొబ్బినోళ్ళతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడకండి అని. దాన్ని ఫాలో అయిపోండి’’ అంటూ అభిమానులకు చెబుతూనే… ‘‘అప్పుడే అయిపోయిందనుకోకు.. ఇపుడే మొదలైంది. ఇంకా చాలా చాలా మంది వస్తారు. నేను ట్విట్టర్‌లోకి వచ్చిన రోజే చెప్పా నువ్ ఇంక ఫినిష్ అని’’ అంటూ కత్తి మహేష్‌కు హైపర్ ఆది వార్నింగ్ ఇచ్చారు. అయితే కత్తి మహేష్ కూడా పవన్ ఫ్యాన్స్ ఎంత రెచ్చిపోతే అంతలా కౌంటర్ చేయడానికే సిద్ధంగా ఉన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

ఇక కత్తి మహేష్ పై సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు రోజుకొకరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఓ దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన చేతిలో పవర్ లేదని కత్తి మహేష్ లాంటి వ్యక్తులు ఇలా విమర్శలు గుప్పించడం సరికాదు. ఇవే విమర్శలు గనక అధికారం ఉన్న వ్యక్తులపై చేస్తే ఈపాటికి కత్తి జైల్లో ఉండేవాడు. పొద్దున్న లేస్తే అదేపనిగా ఆ స్టూడియో.. ఈ స్టూడియో తిరుగుతూ ఒకటే డిబేట్స్, ఒకటే డిస్కషన్స్.. ఏంటిది? విమర్శకు కూడా ఓ విలువ ఉండాలి. విమర్శ విలువైనదిగా ఉన్నప్పుడే దాన్ని సద్విమర్శ అంటాం.. కేవలం సోషల్ మీడియాలో ఫేం సంపాదించుకోవడం కోసమా ఇదంతా.. చాలా బాధాకరమైన విషయం’ అని రచయిత కోన వెంకట్ వ్యాఖ్యానించారు.

 

Comments

comments