movies

పవర్ స్టార్ అజ్ఞాతవాసి సూపర్

అసలు సినిమా టైటిల్ తోనే ఇండస్ట్రీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంత చర్చ పెట్టగలగడం.. బహుశా ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కే సాధ్యం కావొచ్చు. తన PSPK25 సినిమా .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తీస్తున్న కొత్త సినిమా టైటిల్ విషయంలో కాస్త లెట్ అయినప్పటికీ ఆ టైటిల్ రిలీజ్ అయిన మరుక్షణం నుంచి.. ప్రశంసల జల్లు కురిపించడం కూడా.. కేవలం పవన్ కళ్యాణ్ కే సాధ్యమవుతోంది. అసలు పవన్ సినిమా టైటిల్ అజ్ఞాతవాసిగా ఎప్పుడో జనల మధ్యలోకి వెళ్ళిపోయింది. కేవలం నిన్న సోమవారం అధికారికముగా ప్రకటించారు అంతే.

సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అజ్ఞాతవాసికి శుభాకాంక్షలు చెబుతున్నారు. టైటిల్ సూపర్ గా ఉందని చెప్పడమే కాదు.. అద్భుతమని.. అజ్ఞాతవాసి బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని కూడా కొందరు చెబుతున్నారు. అందులో భాగంగానే పవన్ కు వీరాభిమాని అయిన నితిన్.. టైటిల్ అద్భతమంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్.. ఫస్ట్ లుక్ బాగుందని.. పవర్ స్టార్ కళ్లు చూడాలని ట్వీట్ చేసాడు. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందిస్తూ.. క్లాసీ అండ్ పవర్ ఫుల్ అంటూ ట్విట్ చేసాడు .

ఇక ఈ మధ్యనే రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి అజ్ఞాతవాసి తప్పకుండ బ్లాక్ బస్టర్ అంటూ.. పోస్ట్ చేసాడు. సంక్రాంతికి వస్తున్న అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ సూపర్ అంటూ అల్లు శిరీష్ …. పవన్ స్టయిల్ చాలా బాగుందంటూ.. గోపీ మోహన్ లు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాపై కామెంట్స్ చేశారు. ఇంకా చాలామంది ప్రముఖులు అజ్ఞాతవాసిని పొగిడిన వారిలో ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి జనవరి 10 న సంక్రాతి కానుకగా విడుదల కాబోతుంది.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment