movies

పొలిటికల్ పంచ్‌కు పవన్ రెడీ !?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘‘అజ్ఞాతవాసి’’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ సినిమా తరువాత పవన్ మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా తరువాత పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ప్రవేశించనున్నాడు.

కాగా తాజాగా పవన్ దర్శకుడు క్రిష్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. క్రిష్ పవన్‌తో కంచె సినిమాకంటే ముందే ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. ఇక రీసెంట్‌గా పవన్‌కు క్రిష్ చెప్పిన ఓ స్టోరీలైన్ నచ్చడంతో ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించాడట పవన్. ఒకవేళ ఇదే నిజమైతే పవన్-క్రిష్ కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా రానుండటం ఖాయం అని అంటున్నారు చిత్ర వర్గాలు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి హిస్టారికల్ సినిమాను క్రిష్ కేవలం 90 రోజుల్లోనే తెరకెక్కించాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూడు నెలల్లో తమ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట పవన్ అండ్ క్రిష్.

అయితే పవన్ మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమాకు క్రిష్ బ్రేక్ వేస్తాడా లేదా అనే విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఏదేమైనా ఈ కాంబోలో ఓ సినిమా రావాలని ఆశిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment