health

అమ్మ కడుపులో తొమ్మిది నెలలు ఎలా ఉంటామో … అద్భుతమైన విడియో

మాటల్లో చెప్పలేని ఓ అద్భుతమైన అనుభూతి. స్వచ్ఛం అన్న పదానికి అసలైన అర్థం. భగవంతుడిచ్చిన ఆ అమ్మ భగవంతుడికంటే గొప్పదని ఎందుకు అంటారో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ప్రక్రుతి సహజంగా జరిగే కొన్ని అద్భుతమైన ప్రక్రియలను అమ్మ కడుపులో ఏ విధంగా జరుగుతాయో ఈ వీడియోలో చూపించారు.

అమ్మ తన రక్తమాంసాలను పంచి, భరించరాని నొప్పులను భరించి, చావును సైతం ఎదిరించి బిడ్డకు ఊపిరి పోసి జన్మనిస్తుంది. గర్భందాల్చిన క్షణం నుండి తన క్షేమంకన్నా బిడ్డ క్షేమమే ముఖ్యమని తెలుస్తుంది. బ్రహ్మకు మారుపేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా…బాధ కలిగినా వెంటనే అమ్మే గుర్తొస్తుంది.

తొమ్మిది నెలలు తన కడుపులో బిడ్డ కోసం ఒక తపస్సు చేసి జన్మనిస్తుంది తల్లి సృష్టిలోనే తియ్యనైన పదం ‘అమ్మ’. ఆ పిలుపులో ఎంతటి మాధుర్యం దాగుందో చెప్పడానికి మాటలు చాలవు. కడుపులో ఉన్న తొమ్మిది నెలలు ఎంత కష్టమనిపించినా.. దాన్ని ఇష్టంగా మార్చుకుని మనల్ని క్షేమంగా ఈ లోకంలోకి తీసుకొచ్చే అద్భుత శక్తి అమ్మలోనే దాగుంది. పుట్టగానే అక్కున చేర్చుకుని, లాలించి, బుజ్జగించి.. పెంచి, పెద్దచేసి, ప్రయోజకుల్ని చేయడానికి అమ్మ పడే తాపత్రయం అంతా ఇంతా కాదు.

Comments

comments