movies

గరుడవేగ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !!

బాక్సాఫీస్ వద్ద మార్కెట్ కోల్పోయిన రాజశేఖర్‌పై మాత్రం బయ్యర్లు రిస్క్ చేసేందుకు వెనుకాడారు. దీంతో రూ. 11 కోట్లకు గరుడ వేగ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక ఈ చిత్రం మౌత్ టాక్‌తో పబ్లిసిటీ కొల్లగొట్టడంలో సక్సెస్ కావడంతో ఫస్ట్ వీకెండ్‌కు జనాలు థియేటర్స్ వైపు పరుగులు తీసారు.

యాంగ్రీ యంగ్ మ్యాన్‌ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘PSV గరుడ వేగ’ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. చాలా కాలం హిట్స్ లేని రాజశేఖర్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి.

 

చాలా తక్కువ థియేటర్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడం పెద్ద మైనస్‌గా మారింది. నైజాం ఏరియా వరకు పర్వాలేదనిపించినా ఆంధ్రాలో మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా మారింది. అటు ఓవర్సీస్‌లోనూ ‘థోర్’ సినిమా రిలీజ్ కావడంతో అక్కడ కూడా ఇదే సమస్య వచ్చింది. ఏదేమైనా ఉన్న థియేటర్స్‌లోనే ‘గరుడ వేగ’ వేగాన్ని పుంజుకుని కలెక్షన్స్‌ రాబడుతోంది.

Telugu film # PSVGarudaVega

USA … T

hu pre $ 29,477

Fri $ 66,732

Sat $ 109,423

Sun $ 65,666

Total: $ 271,298 [₹ 1.75 cr]

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 0.66 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి రూ. 2.60 కోట్లు రాబట్టింది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ. 3.60 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక యూఎస్‌లో 270,000 డాలర్లు కలెక్ట్ చేసిన గరుడ వేగ ఇప్పటికే ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసింది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి గరుడ వేగ కలెక్షన్స్ ఏరియాలవారిగా ఇలా ఉన్నాయి..

ఏరియా – ఫస్ట్ వీకెండ్ షేర్ కలెక్షన్స్(కోట్లలో)
టోటల్ ఏపీ+తెలంగాణా – 2.60 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.25 కోట్లు
ఓవర్సీస్ – 0.75 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ కలెక్షన్స్ – 3.60 కోట్లు

Comments

comments