news

రాహుల్ ని మార్చేసిన రమ్య!

ప్రతి మగాడు విజయం వెనుక ఒక ఆడది ఉంటారంటారు. సోషల్ మీడియాలో ఆఫీస్ ఆఫ్ రాహుల్ గాంధీ, ఐఎన్సీ ఇండియాకు ఫోలోవర్స్ పెరగడం వెనక కూడా ఒక మహిళ ఉంది. ఆమె రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్, కన్నడ నటి రమ్య. ఫలితంగా నెటిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగింది. ప్రముఖ కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య అంటే తెలియని సౌత్ ఇండియన్ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. కన్నడ, తెలుగు, మళయాలం, తమిళ సినిమాల్లో నటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఫైర్ బ్రాండ్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. రాహుల్ దృష్టిని ఆకర్షించారు. దీంతో రాహుల్ గాంధీ ఆమెను ఏరికోరి కీలక పదవిలో నియమించారు. రమ్య.. కాంగ్రెస్‌ డిజిటల్ కమ్యూనికేషన్స్‌కి అధినేత్రి ఇప్పుడు. రాహుల్ ఆఫీస్ సహా.. సోషల్ మీడియా, ఐటీ బాధ్యతలన్నీ ఆమెకే అప్పగించారు.

రమ్య అసలు పేరు.. దివ్య స్పందన. సినిమాల్లో నటించడం మొదలెట్టాక.. రమ్యగా పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఈమె రాకముందు.. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ , ఫేస్ బుక్ పేజీలు కునారిల్లుతుండేవి. బీజేపీ సోషల్ మీడియా వింగ్ అత్యంత స్ట్రాంగ్. మోఢీ టీమ్ విసిరే బాణాలు చాకుల్లా కుచ్చుకుంటున్నా, బకుల్లా రాహుల్ ను, కాంగ్రెస్ పార్టీని పొడిచేస్తున్నా కౌంటర్ ఇచ్చే దిక్కే ఉండేది కాదు. ఈమె వచ్చిన తరువాత పార్టీ సోషల్ మీడియాను పరుగులెత్తించారు. ఇప్పుడు బీజేపీకి సరైన కౌంటర్లు పడుతున్నాయి. గుజరాత్‌లో బీజేపీని టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలో ఉపయోగపడుతున్నాయి.

సమాచారమే ఏ పార్టీకైనా బలం అని నమ్ముతారు రమ్య. మూడు నెలల నుంచి కాంగ్రెస్ డిజిటల్ మీడియా విభాగంలో నియామకాల జోరు పెంచారు. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నారు. రమ్య సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టకముందు డిజిటల్ వార్ రూమ్‌లో కేవలం ముగ్గురే అమ్మాయిలు ఉండేవారు. ఇప్పుడు ఆఫీస్ మొత్తం స్టాఫ్‌లో 85 శాతం మహిళా ఉద్యోగులే. రాహుల్ నమ్మకాన్ని రమ్య వమ్ము చేయలేదు. ఫాలోవర్స్ సంఖ్యను బాగా పెంచారు. 2009లో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు మాత్రమే ట్విట్టర్ అకౌంట్ ఉండేది. ఆయనకు ఆరువేల మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు థరూర్‌కి 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇదే అత్యధికం. రాహుల్ గాంధీకి 41 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా బేస్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రమ్య అండ్ టీమ్. వీడియో గ్రాఫర్లు, కంటెంట్ రైటర్స్, డాటా రీసెర్స్ టీమ్ నిరంతర ప్రయోగాలు చేస్తోంది.

మొత్తానికి నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడిగా నూటాపాతికేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయిన రాహుల్.. నేటి అధునాతన అస్త్రాలైన సోషల్ మీడియాను ప్రత్యర్థి మోఢీపై బలంగా ఎక్కుపెట్టారనే చెప్పాలి. రమ్య టీం వర్క్ కారణంగా దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది ఆ పార్టీకి. అంతేకాదు ఆయన ప్ర‌సంగాల్లో ప‌రిణితి కూడా పెరిగింది.

క‌ర్ణాట‌క‌కు చెందిన సినీ న‌టి ర‌మ్య అలియాస్ దివ్య స్పంద‌న ప‌లు చిత్రాల్లో న‌టించారు. తెలుగు, త‌మిళ భాషా చిత్రాల్లోను మెరిసారు. 2003లో సినీరంగంలోకి అడుగు పెట్టిన ర‌మ్య అనూహ్యంగా 2012లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, 2013లో క‌ర్ణాట‌క‌లోని మాండ్య లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ త‌దుప‌రి ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసినా.. ర‌మ్య ప‌రాజ‌యం చ‌విచూశారు. 5500 ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. ఇక‌, ఇదే స‌మ‌య‌లో సినీరంగంలో ఆమె వెన‌క‌ప‌డిపోయారు. ఈ విష‌యం రాహుల్ గాంధీకి చేరింది. క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో ర‌మ్య గురించి తెలుసుకున్న ఆయ‌న నేరుగా త‌న అప్పాయింట్ మెంట్ ఇచ్చి ఆమెతో మాట్లాడారు. కట్ చేస్తే ఆమె సోషల్ మీడియా ఇంఛార్జి అయిపోయారు.

ప్రస్తుతం బీజేపీకి సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వస్తున్న కౌంటర్లన్నీ ఈ వార్‌ రూమ్‌ నుంచే. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వార్తల పరిశీలన ఉంటుంది. కానీ సోషల్‌ మీడియాలో ఆ పరిస్థితి ఉండదు. ఏది కరెక్టో ఏది నిజమో తెలుసుకోవడం కత్తి మీద సాములా ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా అది పార్టీ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీస్తుంది. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ జరగకపోయినా, ఇప్పటి వరకూ ఈ విభాగాన్ని విజయవంతంగా నడిపిస్తున్న రమ్యను చూస్తే… రాహుల్‌గాంధీ ర‌మ్య‌కు స‌రైన పొజిష‌నే క‌ల్పించార‌ని అర్ధ‌మ‌వుతుంది. రాహుల్ ప్ర‌సంగాలు ఎలా ఉండాలో..? ట‌్వీట్ల‌లో ఎలాంటి మ‌సాలా ప‌డాలో కూడా ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంటున్నార‌ట‌. దీంతో ఇప్పుడు రాహుల్ ఏం మాట్లాడినా.. సంచ‌ల‌నంగా మారింది. మొన్నామ‌ధ్య జీఎస్టీ భారంపై ఆయ‌న చేసిన ట్వీట్‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. దీని వెనుక ర‌మ్య ఉండ‌డం గ‌మ‌నార్హం. నిన్న ప్రధానిని ఉద్దేశించి ‘నువ్వు మనిషివా? మోఢీవా?’అంటూ రాహుల్ విసిరిన చలోక్తి జనాల్లోకి మామూలుగా పోలేదు. సో.. రాహుల్ వెనుక ర‌మ్య ఉండి బాగా న‌డిపిస్తున్నార‌న్న టాక్ కాంగ్రెస్ వ‌ర్గాల్లోనే ట్రెండ్ అవుతోంది.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment