reviews

” రాజా ది గ్రేటర్ ” రివ్యూ & రేటింగ్

చిత్రం: రాజా ది గ్రేట్
నటీనటులు: రవి తేజ, మెహరీన్, రాదిక శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి.
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాణం: దిల్ రాజు
సంగీతం: సాయి కార్తీక్.
కథ: లక్కీ ( మెహరీన్ ) ఒక నిజయతిగల పోలీస్ ఆఫీసర్ ( ప్రకాష్ రాజ్ ) కూతురు. ప్రకాష్ రాజ్ ఒక కేసు విషయమై విలన్ తమ్ముడిని చంపుతాడు. తన తమ్ముడిని చంపడంతో విలన్ ప్రకాష్ రాజ్ ని చంపేస్తాడు అలాగే అతని కూతురు లక్కీనీ కూడా చంపటానికి విలన్ ప్రయత్నిస్తా ఉంటాడు. అప్పుడు లక్కీ అతని నుంచి తప్పించుకోటానికి దర్జీలింగ్ కు వెళ్లి అక్కడ దాక్కుంటుంది.
రాజా (రవి తేజ) పుట్టుకతోనే అంధుడు. రాజాకు పోలీస్ అవ్వాలి అనే లక్ష్యం ఉంటుంది. అదే సమయంలో పోలీస్ అయిన తన తల్లి రాజా కి లక్కీ నీ కాపాడే మిషన్ ను అప్పగిస్తుంది. రాజా లక్కీ నీ విలన్ల బారినుంచి ఎలా రక్షిస్తాడు అన్నదే మిగిలిన కథ.

నటీనటుల ప్రదర్శన: 
సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ హీరో రవి తేజ పెర్ఫార్మన్స్. చూపులేని వ్యక్తిగా చాలా బాగా నటించాడు అలాగే తన మార్క్ కమెడీతో ప్రేక్షకులని ఆకట్టుకుంటాడు. మెహరీన్ మరియు రాదిక శరత్ కుమార్ తమ పాత్రలకి న్యాయం చేసారు. అలాగే ఈ సినిమాలో రాజా చిన్నప్పటి పాత్ర రవితేజ కొడుకు పోషించడం విశేషం. పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ రెడ్డి మరియు హరి తేజ తమ పాత్రల్లో బాగానే చేసారు.

సాంకేతిక విభాగం:
 దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా మొత్తం తన మార్క్ కామెడీతో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేసాడు కానీ స్టొరీ, స్క్రీన్ ప్లే మీద ఇంకొంచం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే కొట్టాడు కానీ పాటలు అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పుకోవాలి. దిల్ రాజు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
రవి తేజ పెర్ఫార్మన్స్
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
సినిమా మొదటి నుంచి చివర వరకు ఎంటర్టైన్ చేస్తుంది
మాటలు
ఫైట్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టొరీ
స్క్రీన్ ప్లే
తీర్పు: ఈ సినిమా హీరో రవి తేజ తన పెర్ఫార్మన్స్ తో మంచి కామ్ బ్యాక్ ఇచ్చాడు. మాస్, ఫామిలీ అందరి ఆడియన్స్ మంచిగా ఆకట్టుకునేలా దర్శకుడు అనిల్ రావిపూడి బాగా దర్శకత్వం వహించాడు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహాయించి సినిమా ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. మొత్తం మీద రొటీన్ స్టోరీని పక్కన పెడితే రాజా ది గ్రేట్ సినిమా ఈ దీపావళికీ ఫామిలీ అందరితో కలిసి చూడతగ్గా సినిమా.
తెలుగు ఫ్రేమ్స్ రేటింగ్ : 3.25

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment