news

రజనీకాంత్ జీవితంలో CM అవ్వలేడు… విషయాన్నీ బయటపెట్టిన ప్రముక జ్యోతిష్కుడు!

రాజకీయ ప్రవేశంపై సూపర్‌‌స్టార్ రజనీకాంత్ స్పష్టతను ఇచ్చారు. రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఆయన కీలక ప్రకటనను చేశారు. అంతేకాదు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పెట్టి పోటీ చేస్తానని రజనీ వెల్లడించారు. ఈ మేరకు చెన్నైలో జరుగుతున్న అభిమానుల సమావేశంలో స్పష్టతను ఇచ్చారు. అయితే రాజకీయాల్లోకి రజనీ రావాలని ఎప్పటినుంచో అభిమానులు భావిస్తున్నారు. జయలలిత మరణం తరువాత ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని రోజులు ఆలోచించిన రజనీ.. చివరకు రాజకీయాల్లోకి వచ్చేందుకే మొగ్గు చూపారు. దీంతో అభిమానులు సంబరాలను జరుపుకుంటున్నారు.

అయితే నెక్ట్స్ తమిళనాడు సీఎం ఎవరు? చెన్నైకి వెళ్లి ఏ తలైవా అభిమానిని అడిగినా … మా సూపర్ స్టారే… అనేస్తున్నారు! కానీ, రజినీకి అంత సీన్ లేదంటూ బాంబు పేల్చారు ఓ ప్రఖ్యాత జ్యోతిష్కుడు. కర్ఱాటకకు చెందిన ప్రకాష్ అమ్మునాయ్ అనే అస్ట్రాలజర్ రజినీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనది మకర రాశి, సింహ లగ్నం కావటం వల్ల సూపర్ స్టార్ ని ఓడించటం ఎవరి తరమూ కాదని చెప్పారు. అయితే, అదే సమయంలో సీఎంగా తమిళనాడుని ఏలే ఛాన్స్ కూడా లేదన్నారు. మరెవరినైనా ముఖ్యమంత్రిని చేసి తాను పార్టీ చీఫ్ గా వుంటే బావుంటుందట!

ఈ విషయంలో ఎంత వరకూ నిజం వుందో కాని… తమ హీరో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించకుండా వేరేవార్ని అందలం ఎక్కిస్తాడంటే అభిమానులు ఊరుకుంటారా? అదీగాక… రెండు దశాబ్దాల ఊగిసలాట తరువాత రాజకీయ ప్రవేశం చేస్తున్న తలైవా సీఎం అవ్వకుండా తెర వెనుక చక్రం తిప్పటానికి సిద్ధపడతాడా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు! అవన్నీ పక్కన పెడితే… కర్ఱాటక జ్యోతిష్కుడు ఈ తమిళ సూపర్ స్టార్ గురించి మరో ఆసక్తికర , ఆందోళనకర విషయం చెప్పారు. రజినీకి దగ్గరి వారి నుంచే రాజకీయంగా ముప్పు వుందట. అలాంటి వెన్నుపోటు దారుల్ని ఓ కంట గమినిస్తూ జాగ్రత్తగా వుండాలట!!!

Comments

comments