movies

రియాలిటీకి దూరంగా రోబో రజినీ!!!!

తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో దర్శకుడు శంకర్ స్ట్రాటజీయే వేరు. వందల కోట్లతో తెరకెక్కించే సినిమాలు కాబట్టి.. జనాల్లో విపరీతమైన ఆసక్తి కలిగించడం కోసం అంచనాలకు అందని రేంజులో ప్రమోషన్స్‌ని చేపడతాడు. అంతదాకా ఎందుకు.. జస్ట్ ఫస్ట్‌లుక్‌తోనే ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాడు. ఒక్కొక్క పోస్టర్‌ని ఒక్కో విధంగా రిలీజ్ చేస్తూ.. రోజురోజుకి చిత్రంపై క్రేజ్ పెరిగేలా చేస్తాడు. అలాంటిది.. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ‘2.0’ చిత్రం పోస్టర్లను మన ఊహకే అందని స్థాయిలో ఉంటాయని అనుకున్నారు. అనుకున్నట్లే.. కొన్ని పోస్టర్లను అద్భుతంగా రిలీజ్ చేశాడు. హాలీవుడ్‌ని తలదన్నే రేంజులో పోస్టర్స్ రిలీజ్ చేసి.. ఔరా అనిపించాడు. కానీ.. ఒక్క పోస్టర్‌తో మాత్రం డిజప్పాయింట్ చేశాడు.

ఆడియో లాంచ్‌కి ఒకరోజు ముందు ఈ చిత్రబృందం ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసింది. అందులో రజినీ, అక్షర్, అమీజాక్సన్‌లను చూపించారు. రజినీ, అమీ రొమాంటిక్ పోజులో కనిపించగా.. వారి వెనుక అక్షయ్ కళ్లను చూపించడం జరిగింది. అయితే.. రజినీ ఈ పోస్టర్ మరీ యంగ్‌గా కనిపించారు. గత ‘రోబో’ చిత్రంలో కంటే ఇది చాలా డిఫరెంట్‌గా, ఎబ్బేట్టుగా ఉంది. ‘రోబో’లోని లుక్ చాలా మెచ్యూర్డ్‌గా, రజినీ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటే.. ‘2.0’లో మాత్రం మరీ యంగ్‌గా చూపించేయడంతో అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఇక సెక్సీ బ్యూటీ అమీ చాలా ఓల్డ్‌గా దర్శనమిచ్చింది. తన వయసుకి ఆ లుక్ అసలు ఏమాత్రం సరిపోలేదు. అక్షయ్ కుమార్ పరిస్థితి కూడా ఇంతే! అతడ్ని కూడా ఏదో ముసలివాడిలాగా చూపించేశారు. దీంతో.. ఈ పోస్టర్‌కి పాజిటివ్ రిపోర్ట్స్ తక్కువ, నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చిపడ్డాయి.

ఇకపోతే.. 27వ తేదీన దుబాయ్‌లో ఈ మూవీ ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బహుశా ఈ రేంజులో ఏ ఇండియన్ సినిమా వేడుక గతంలో జరిగి ఉండదు. ముందుగా చెప్పినట్లుగా ఈ వేడుకకి కమల్ హాసన్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ఆ వేడుకని మరింత రక్తి కట్టించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది.

 

Comments

comments