reviews

రాజు గారి గది -2 రివ్యూ (తెలుగు) లో.

చిత్రం: రాజు గారి గది -2
నటీనటులు: నాగార్జున, సమంత, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, రావు రమేష్
దర్శకత్వం: ఓంకార్
నిర్మాణం: పీవీపీ సినిమా, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: ఎస్. ఎస్. థమన్.

కథ:
అశ్విన్, రవి ( వెన్నెల కిషోర్ ), ప్రవీణ్ అనే ముగ్గురు కలిసి ఒక రిసార్ట్ కొంటారు. కొన్ని రోజులు తరువాత ముగ్గురికి ఆ రిసార్ట్ లో దెయ్యం ( సమంత ) ఉన్న సంగతి తెలుస్తుంది. ఆ దెయ్యం నుంచి విముక్తి పొందటానికి రుద్రా ( నాగార్జున ) అనే మెంటలిస్టును కలుస్తారు. ఆ ఇంట్లో ఉన్న దెయ్యం కథ ఏంటి.. అది అక్కడే ఎందుకు తిరుగుతుంది.. చివరికి రుద్ర ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనేది కథ.

నటీనటుల ప్రదర్శన: సినిమాలో నాగార్జున ప్రేవిసించిన తరువాతనే అసలైన కథ మొదలవుతుంది. మెంటలిస్టుగా నాగార్జున నటన ఆకట్టుకుంది. అయన కనిపించినంతసేపు కాస్త ఉత్సాహంగా అనిపిస్తుంది. అలాగే దెయ్యంగా సమంత పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. క్లైమాక్సలో సమంత తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది. సీరత్ కపూర్ తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. అశ్విన్, వెన్నెల కిషోర్,ప్రవీణ్, షకలక శంకర్, రావు రమేష్ మరియు నరేష్ తమవంతు పాత్రను సమర్థవంతంగా నటించారు.

సాంకేతిక విభాగం:
రాజు గారి గది మొదటి బాగంతో పోల్చుకుంటే దర్శకుడు ఓంకార్ తన పనితనాన్ని ఈ చిత్రంలో వందశాతం నిరూపించుకోలేదు అనే చెప్పాలి. అబ్బూరి రవి మాటలు చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి. సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసాడు.

ప్లస్ పాయింట్స్: కీలక పాత్రల పెర్ఫార్మన్స్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాటలు.
ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలు క్లైమాక్స్ నిర్మాణ విలువలు.

మైనస్ పాయింట్స్: ఊహించినంతగా కామెడీ & హారర్ సన్నివేశాలు లేకపోవటం. మొదటి 30 నిముషాలు.

తీర్పు: ‘రాజు గారి గది – 2’ చిత్రం లో హారర్ & కామెడీ కోసం చూదాం అనుకున్న ప్రేక్షకులు నిరుత్సాహం చెందుతారు. ఫామిలీ ఆడియన్స్కి ఈ సినిమాలో ముఖ్యంగా ఆకట్టుకునే అంశం ఎమోషనల్ కంటెంట్. నాగార్జున, సమంతల పాత్ర సినిమాకి కీలకం ముఖ్యంగా క్లైమాక్స్ లో వాళ్ళ నటన అద్భుతం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతగా మెప్పించలేకపోయిన సెకండ్ హాఫ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మొత్తం మీద ఒక్కసారి చూడతగ్గా చిత్రమే.

తెలుగు ఫ్రేమ్స్ రేటింగ్ : 3/5.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment