movies

రుణం తీర్చుకొనునన్న రామ్ చరణ్.

రామ్  చరణ్  హీరోగా  దిల్ రాజు   నిర్మాతగా  వంశి  పైడిపల్లి  దర్శకత్వంలో  వచ్చిన  ఎవడు  సినిమాలో బన్నీ  స్పెషల్  రోల్  పోషించాడు. బన్నీ  ఎవడు  సినిమాలో  నటించడం  సినిమాకి  ప్లస్  అయింది. ఇప్పుడు  వక్కంతం వంశి  దర్శకతంలో  బన్నీ  హీరోగా  నా  పేరు  సూర్య  నా  ఇల్లు  ఇండియా  అనే  సినిమా సెట్స్  పైకి  వచ్చింది  ఈ  చిత్రానికి  మెగా  బ్రదర్  నాగబాబు  కూడా  నిర్మాత వహిస్తున్నారు.


గతంలో రామ్  చరణ్  నాగబాబు కాంబినేషన్లో  వచ్చిన  ఆరంజ్  చిత్రంతో   నాగబాబు తీవ్రంగా నష్టపోయిన  విషయం  తెల్సిందే  ఐతే  ఆ నష్టాన్ని  పూర్చడానికి  రామ్  చరణ్  కూడా  తన  వంతు  బాధ్యతని  నెరవేర్చనున్నాడనే  సమాచారం.నా  పేరు  సూర్య  చిత్రంలో  అత్యంత  కీలకమైన  పాత్ర  చరణ్  పోషిస్తున్నాడనే  సమాచారం. చరణ్  ఇప్పుడు  రంగస్థలం  1985  చిత్రం  కోసం  బాగా  గడ్డం  పెంచాడు  మరో  వైపు  మెగా స్టార్  151వ  చిత్రం  ‘సైరా నర్సింహా రెడ్డి’  సినిమా  కోసం  ప్రీ  ప్రొడక్షన్  పనుల్లో  బిజీగా ఉన్నాడు  చరణ్.

కాబట్టి  ప్రస్తుతం  నా  పేరు  సూర్య  సినిమాలో  చరణ్  పాత్ర  షూటింగ్  ఇప్పుడే  ఉండదు  అని  రంగస్థలం  షూటింగ్  ఐపోయాక,  సైరా నర్సింహా  రెడ్డి  చిత్రం  సెట్స్  పైకి  వెళ్లిన  తర్వాత  చరణ్  పాత్ర  షూటింగ్  జరుగుతుంది  అని  అంచనా.

Comments

comments