movies

సినిమాలు మిస్ చేసుకుని తర్వాత పశ్చాత్తాప పడ్డ హీరోలు..

అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది..కానీ దురదృష్టం తలుపు తీసే వరకూ తడుతూనే ఉంటుంది..అబ్బే మ్యాటర్ కి  సామెతకి సంభందంలేనట్టుంది కదా… అయినా కంటిన్యూ అవుదాం లెండి… సినిమా ఇండస్ట్రీలో ఉన్నోళ్ల అదృష్టాలు అదేనండి తలరాతలు మారేది కేవలం ఒకే ఒక సినిమాతో.. ఒక్క సినిమా చాలు వాళ్లని తీసుకెళ్లి శిఖరం పై కూర్చోబెట్టాలన్నా,అధ: పాతాలానికి పడేయాలన్నా..ఒక సినిమా చేయడానికి ముందు ఎన్నో కథలు వింటాం..మనం విన్నవి మనకు సరిపడవనో లేదంటే హిట్ అవ్వదనో మరేదైనా కారణం చేత రిజెక్ట్ చేసి..అదే కథ వేరే హీరో చేసి సూపర్ డూపర్ హిట్ అయితే అప్పుడు ఉంటుంది చూడండి బాద…. అలాంటి కొన్ని సినిమాలు..హీరోలు..

అర్జున్ రెడ్డి..

 

తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమాగా చెప్పొచ్చు.ఎన్నో వివాదాల మధ్య రిలీజైనా కూడా సూపర్ హిట్ అయింది.డైరెక్టర్ వంగా సందీప్,విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయారు… వాస్తవానికి ఈ సినిమా కథ డైరెక్టర్ మొదట వినిపించింది అల్లు అర్జున్ కి అర్జున్ ఎందుకు రిజెక్ట్ చేసారో తెలీదు కానీ…తర్వాత వినిపించిన శర్వానంద్ మాత్రం అందులో బోల్డ్ నెస్ కి భయపడి సినిమా కాదనుకున్నారు.శర్వానంద్ సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు ..సో తను భయపడడంలో అర్దం ఉంది..సినిమా సూపర్ హిట్,శర్వానంద్ పశ్చాత్తాపపడడం రెండూ జరిగాయి..ఇదే సినిమా రీమేక్ తో తమిళ నటుడు విక్రమ్ కొడుకు తెరంగేట్రం చేస్తున్నాడు..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిస్ చేసుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు:

  • మిర‌ప‌కాయ్-ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ర‌వితేజ‌

  • ఇడియ‌ట్ -ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ర‌వితేజ‌

 

  • సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు- ప‌వ‌న్ క‌ళ్యాణ్- ర‌వితేజ‌

  • అమ్మ‌నాన్న ఓ త‌మిళ‌మ్మాయి-ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ర‌వితేజ‌

 

  • అత‌డు- ప‌వ‌న్ క‌ళ్యాణ్- మ‌హేష్.

సింహాద్రి.

 

రాజమౌలి,ఎన్టీయార్ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ,బ్లాక్ బాస్టర్ హిట్..ఈ సినిమాకు మొదట హీరో అనుకున్నది బాలక్రిష్ణని..ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ బాలక్రిష్ణకి ఈ కథ వినిపిస్తే,బాబాయి కాదంటే అబ్బాయితో చేసారంట ఈ మూవీ..బాలయ్య మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ ఇది.ఎన్టీయర్ రేంజ్ ని మరింత పెంచిన మూవీ ఇది.

జెంటిల్మాన్

యాక్షన్ కింగ్ అర్జున్..యాక్షన్ కింగ్ గా మారింది ఈ సినిమాతోనే..ఈ సినిమా మొదట వెళ్లింది రాజశేఖర్ దగ్గరకు..కానీ అప్పటికి డేట్స్ సెట్ అవ్వక రాజశేఖర్ చేయలేకపోయారు..అదే కనుక చేసుంటే రాజశేఖర్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ ఉండేది..అర్జున్ యాక్షన్ కింగ్ అవ్వడానికి మరొ సినిమా ఉపయోగపడేది..జెంటిల్మాన్ చేయలేకపోయినందుకు రాజశేఖర్ ఈ మధ్య కూడా గుర్తు చేసుకుని బాదపడ్డారు.

చంటి

పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం,ఓ ప్రేమా నా ప్రేమా..చంటి సినిమా పాటలు ఇప్పుడు విన్నా కొత్తగానే ఉంటాయి.వెంకటేశ్ నటన అందరిని ఏడిపిస్తుంది కూడా..ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్..ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని రాజేంద్రప్రసాద్ ప్రయత్నిస్తుంటే..వెంకటేశ్ ఆల్రెడీ సినిమా మొదలెట్టేశారు.ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకుని బాదపడ్తుంటారు.రాజేంద్రప్రసాద్ గారిలో కూడా విలక్షణ నటుడున్నాడు కాబట్టి ఈ పాత్రని రాజేంద్రప్రసాద్ కూడా బాగానే పొషించేవారేమో..ఏదైతేనేమి రాజేంద్రప్రసాద్ గారు మిస్సయిన హిట్ సినిమా చంటి.

ఠాగూర్

రాజశేఖర్ కి,చిరంజీవికి వివాదం రావడానికి కారణం ఠాగూర్ సినిమానే అంటారు కొందరు.ఈ సినిమా ను రాజశేఖర్ చేద్దామనుకుంటుండగా చిరంజీవి చేసారనేది టాక్..తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన రమణ సినిమాకి రీమేక్ ఠాగూర్..తమిళంలో మురుగదాస్ దర్శకత్వం వహించారు,తెలుగులో వివి వినాయక్ తెరకెక్కించారు.రాజశేకర్ మిస్ అయిన హిట్ మూవీ ఠాగూర్..

Movie Name- First offer – Performed by

  • ఎవ‌డు- ఎన్టీఆర్ & క‌ళ్యాణ్ రామ్ – రామ్ చ‌ర‌ణ్ & అల్లు అర్జున్.
  • కిక్ – ఆది- ర‌వితేజ‌ఆర్య‌- ఎన్టీఆర్- అల్లు అర్జున్
  • భ‌ద్ర‌-  అల్లు అర్జున్-ర‌వితేజ‌
  • దిల్-ఎన్టీఆర్- నితిన్

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment