movies

అదిరిపోయేలా ” రోబో 2.0 ” ఆడియో వేడుకలు

   సూపర్ స్టార్ రజిని కాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న 2.0 ఆడియో విడుదల ఈ నెల 27న దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత ఏఅర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఐతే చిత్ర నిర్మాతలు ప్రపంచం మొత్తం మన భారతీయ సినిమా వైపు తిరిగి చూసేలా ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ అయిన ” బుర్జ్ పార్క్ హోటల్ “లో భారీ ఏర్పాట్లతో చేస్తుంది.

  దుబాయ్ బుర్జ్ హోటల్ లో ఒక సినిమా ఆడియో వేడుక జరిపేందుకు దుబాయ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వటం ఇదే మొదటిసారి అంట. హాలీవుడ్ సినిమాలను తలదాన్నెల చిత్ర నిర్మాతలు దాదాపు 12 కోట్ల ఖర్చుపెట్టి మరి దుబాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడికి వొచ్చే అతిధులు కోసం బుర్జ్ హోటల్ లో ఒక్క టేబుల్ ఏర్పాటు చెయ్యటానికె 6 లక్షలు అవుతుందట. ఈ ఏర్పాట్లు చూస్తుంటే 27న దుబాయ్ నగరం కాస్త 2.0 నగరంగా మరిపోయేలా ఉంది.

2.0 ఆడియో వేడుకల్లో హైలైట్ అవ్వనున్న అంశాలు
★ రజినికాంత్, అక్షయ్ కుమార్, శంకర్, అమీ జాక్సన్, రెహమాన్ మరియు ఇతర తారాగణం తమ హోటల్ నుంచి హెలికాప్టర్ లో బుర్జ్-అర్-అరబ్ టవర్ మీద ల్యాండ్ అయ్యి ఆడియో వేడుకలకి వస్తారు.
★ దుబాయ్ లోని బుర్జ్ పార్క్ హోటల్లో ఆడియో వేడుకలు జరుపుకున్నా ఏకైక సినిమాగా 2.0 రికార్డ్స్ లోకి ఎక్కనుంది.
★ ఏ అర్ రెహ్మాన్ ఆడియో వేదికపై 125 మంది సింఫని సంగీత కళాకారులతో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు.
★ ఈ ఆడియో వేడుకల్లో పాటలకి కొరియోగ్రాఫర్ బోస్కో బృందం డాన్స్ చేయనున్నారు.
★ 12 వేల మందికి ఆడియో పాసులను ఉచితంగా ఇచ్చారు. అలాగే స్పెషల్ పాసులను 65 వేలకు అమ్మరట.
★ దుబాయ్ లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఆడియో వేడుకలు లైవ్ గ ప్రదర్శించనున్నారు ఇందుకోసం 2కోట్ల ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఆయ షాపింగ్ మాల్స్ లో ఏర్పాటు చేసారు.
★ ఈ ఆడియో వేడుకలకు దుబాయ్ రాజు మొహమ్మద్ బిన్ రషీద్ ముఖ్య అతిధిగా హాజరు అవుతారని సమాచారం.

Comments

comments