movies

సాహో సినిమా హీరోయిన్ ఫిక్స్ ఐపోయింది ఎవరో తెలుసా?

ప్రభాస్  బాహుబలి  2 తర్వాత  నటించబోతున్న సాహో చిత్రం ప్రస్తుతం షూటింగ్  జరుపుకుంటుంది. సాహో చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ 150 కోట్లతో నిర్మిస్తుంది. ఈ చిత్రం కోసం  ప్రభాస్ బాగా కష్ట పడుతున్నాడు . ఈ సినిమా కి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. సుజీత్ ఇంతకముందు రన్ రాజా రన్ సినిమా తీసాడు. సాహో సినిమా కి ఇంత భారీ వ్యయం అవ్వడానికి కారణం హోలీవూడ్ నుండి వచ్చిన టెక్నిషియన్ ఒక యాక్షన్ సీన్ కోసం ఏకంగా రూ/-25 కోట్లు ఖర్చు పెట్టించాడట. ఇంత ఖర్చు పెట్టి చిన్న డైరెక్టర్ తో సినిమా కి ప్రభాస్ ఒప్పుకున్నారు అంటే స్టోరీ ఏ రేంజ్  లో ఉంటుందో చూడాలి మరి.

సాహో చిత్ర యూనిట్ కి  నిన్న మొన్నటి దాకా ఉన్న టెన్షన్లు పోయాయి. అవును సాహో సినిమా లో హీరోయిన్ ఫిక్స్ అయిపొయింది ఆరు అడుగుల కటౌట్ పక్కన హీరోయిన్ గా చాల మంది పేర్లు వినిపించిన చివరికి బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ని తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రభాస్ కి బాహుబలి తో బాలీవుడ్, కొలీవూడ్, మొలీవూడ్, లో క్రేజ్ పెరిగిపోయింది అందుకే బాలీవుడ్ భామ కి ఒకే చెప్పారు. ఈ చిత్రానికి శ్రద్ధ కపూర్ రూ/-8 కోట్లు పారితోషకం  తీసుకోనుంది అని సమాచారం.

Comments

comments