news

సమంతలో మరో కోణాన్ని బయటపెట్టిన అఖిల్!!

ఆడవాళ్లు పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత.. ఎన్నో మార్పులొస్తాయి. పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలు, కొత్తగా వేరే ఇంట్లో ఉండాల్సి రావడం… అందుకే భార్యగా ఎలా ఉండాలనే విషయంలో మన పెద్దవాళ్లు ఎన్నో విషయాలు నేర్పించేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది అనుకోండి.. అత్తిల్లు అయినా పుట్టిల్లు అయినా నవతరం మహిళకు చాలా ఫ్రెండ్లీ వాతావరణంతోనే ఉంటున్నాయి. సమంత ఎంత పెద్ద యాక్ట్రస్ అయినా సరే… కోడలిగా, భార్యగా అక్కినేని వారింట కొత్త క్యారెక్టర్ లోకి ప్రవేశించింది. అయితే అప్పటి సామ్ కి, ఇప్పటి సామ్ కి ఎంతో తేడా ఉందట. వదినలో వచ్చిన ఆసక్తికరమైన మార్పును ఇటీవల ఓ మీడియా చిట్ చాట్ లో అఖిల్ బయటపెట్టాడు. 22న ప్రేక్షకుల ముందుకు హలో మూవీ రాబోతున్న క్రమంలో ప్రమోషన్ కోసం తిరుగుతున్నాడు అఖిల్.. ఈ క్రమంలో సమంత గురించి పంచుకున్న విషయాలే ఆసక్తిగా ఉన్నాయి.

నాగచైతన్యతో సమంతకి పెళ్లవ్వడానికి ముందు నుంచీ అఖిల్ తో కలిసి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కోసం యాడ్స్ చేసేది. కాబట్టే అప్పటి నుంచే అఖిల్, సమంతలకు మంచి ర్యాపో ఉండేది. అయితే.. అప్పటికి కేవలం అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ కావడంతో అఖిల్ ని బాగా ముద్దుగా చూసుకొనేది సమంత. అయితే.. పెళ్లాయ్యాక సమీకరణలు మారిపోయాయి. ఇప్పుడు ఇంటికి కోడలు, నాగచైతన్యకి భార్య, అఖిల్ కి వదిన అయ్యింది. దాంతో.. పాపం ఇంట్లో అఖిల్ మీద అజమాయిషీ చలాయిస్తోందట. ఛాన్స్ దొరికితే చాలు ర్యాగింగ్ కూడా చేస్తోందట. అది కూడా ఏరేంజ్ లో అంటే అఖిల్ బాబు ఏకంగా ఇంటికి వెళ్లడానికి కూడా భయపడుతున్నాడట.

తనకు అమ్మానాన్న తర్వాత బాగా ఇష్టమైన వ్యక్తి కూడా వదినమ్మే(సమంత) అని చెప్పడం విశేషం. “హలో” మూవీని ఈసారి నాగార్జునతోపాటు నాగచైతన్య-సమంతలు కూడా స్పెషల్ కేర్ తీసుకొని ప్రమోట్ చేయడం మొదలెట్టారు. ఈ సినిమాతో అఖిల్ కు హిట్ ఇవ్వడమే కాక స్టార్ హీరోగా అతడిని నిలబెట్టడమే ధ్యేయంగా అక్కినేని కుటుంబం మొత్తం జాగ్రత్తలు తీసుకొంటుండడం చూస్తుంటే.. అఖిల్ ను లక్కీయస్ట్ హీరో అనకుండా ఉండలేం. సమంత ప్రమోషన్ తో ఓ మోస్తారు సినిమా అయిన ‘రాజుగారి గది 2’మంచి కలెక్షన్లే రాబట్టింది. చూడాలి హలో విషయంలో సామ్ ఛరిష్మా ఎంతవరకు పనిచేస్తుందో?!!

Comments

comments